బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఏ రేంజ్ లో క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ క్రేజ్ ఉన్న ఏకైక హీరో యంగ్ రెబల్ స్టార్ మాత్రమే. బాహుబలి కోసం దాదాపు ఐదేళ్ల సమయం కేటాయించిన ప్రభాస్.. ఇప్పుడు సాహో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలోని ప్రధానమైన అన్ని భాషల్లోనూ విడుదల కానున్న సాహో మూవీలో ఆఫర్ కోసం చాలామందే ఎదురుచూస్తున్నారు. ఒక్క మంచి రోల్ పడితే.. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవచ్చనే ఆలోచనే అందరిదీ. మరి అలాంటి అవకాశం వస్తే.. ఎవరైనా కాదంటారా? కాదనే అన్నాడు ఓ అందమైన విలన్. సాహో మూవీలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. కానీ ఈ సినిమాలో విలన్ పాత్రకు మొదటి ఆప్షన్ నీల్ నితిన్ కాదట. ఆ రోల్ కు మొదటగా అరవింద్ స్వామిని అప్రోచ్ అయ్యారట సాహో టీం. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించేందుకు గాను.. అరవింద్ స్వామికి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.
మొదట ఆలోచించుకుంటానని చెప్పిన ఈ అందమైన హీరో కం విలన్.. చివరకు డేట్స్ ఎడ్జస్ట్ చేయలేనని చెప్పి తప్పుకున్నాడట. కానీ అసలు వాస్తవం మాత్రం అది కాదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ధృవ మూవీలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి.. మళ్లీ హీరో పాత్రలనే చేస్తున్నాడు. నేషనల్ రేంజ్ మూవీ అయినా సరే..విలన్ పాత్ర కావడంతోనే సాహో ఆఫర్ ను కాదన్నాడట అరవింద్ స్వామి. ఓ డెసిషన్ తీసుకుంటే.. దానికి ఈ హీరో ఎంతగా కట్టుబడి ఉంటాడని చెప్పేందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్!