‘కార్తికేయ’ తర్వాత ఇంకో డైరెక్ట్ మూవీ చేద్దామనే అక్కినేని కాంపౌండ్లో అడుగుపెట్టాడు చందు మొండేటి. కానీ అనుకోకుండా ‘ప్రేమమ్’ రీమేక్ చేయాల్సి వచ్చింది. ఐతే ఈ ప్రపోజల్ వచ్చినపుడు ముందు చందు అంత పాజిటివ్ గా రియాక్టవ్వలేదని నాగచైతన్య ఆల్రెడీ చెప్పాడు. మరి అతను ఈ సినిమా చేయడానికి ఎలా కన్విన్స్ అయ్యాడు? ఈ విషయంలో ప్రధాన కారణం అక్కినేని నాగార్జునేనట. నాగార్జునకు వీరాభిమాని అయిన చందు.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి నాగార్జున ఓకే అనడంతో ఆయన్ని ఒక్క సీన్లో అయినా డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుంది కదా అనే ముందు ‘ప్రేమమ్’ ఒప్పేసుకున్నాడట.
‘‘ప్రేమమ్ ఒరిజినల్ లో ప్రిన్సిపాల్ దగ్గరికొచ్చి మాట్లాడే పాత్రలో హీరో తండ్రి కనిపిస్తాడు. ఆ పాత్రను నాగార్జునతో చేయించాలనుకున్నాం. ఆయన కూడా ఓకే అనడంతో ఇక నేను హ్యాపీగా ‘ప్రేమమ్’ రీమేక్ చేయడానికి రెడీ అయిపోయాను. ఒక్క సీన్లో అయినా నా ఫేవరెట్ యాక్టర్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కిందిలే అనుకున్నాను. ఆ తర్వాత ఆ పాత్రను వెంకటేష్ గారితో చేయించి.. చివర్లో నాగార్జున గారు వచ్చేలా మార్చాం. వెంకటేష్ గారి ఎపిసోడ్ మాకు సినిమా మీద చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయన ఉన్న నాలుగైదు నిమిషాలు చాలా ఎనర్జిటిగ్గా ఉంటుంది. సింగిల్ టేక్ లో ఆ సీన్ చేసేశారు వెంకీ గారు. థియేటర్లో కూడా ఈ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక యాక్షన్ ఎపిసోడ్ ఇచ్చే ఎనర్జీని ఈ సీన్ ఇచ్చింది’’ అని చందూ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/