మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సైరా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తవ్వలేదు కానీ సినిమా గురించి ఎవరు ఊహించని విషయాలు బయట చాలా హాట్ టాపిక్ అవుతున్నాయి. అవి ఎంత వరకు నిజమనే విషయం పక్కనపెడితే.. ఇటీవల చిరంజీవి గెడ్డం తీసెయ్యడం అభిమానుల్లో చాలా అనుమానాలను కలిగిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా సైరా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ లుక్ కోసం చిరు ఎప్పటి నుంచో గెడ్డం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ముఖ్యంగా కోర మీసాలతో మెగాస్టార్ చాలా పవర్ఫుల్ కనిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ని చిరు అదే స్టైల్ లో పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఆ లుక్ లో కనిపించకపోవడం వెనుక విషయం ఏమిటి అనే విషయానికి వస్తే.. నెక్స్ట్ షెడ్యూల్లో మెగాస్టార్ ఆ లుక్ లో కనిపించాల్సిన అవసరం లేదట. దర్శకుడు ఆలోచన ప్రకారం మెగాస్టార్ కొంచెం యువకుడిలా కనిపించాలని ప్లాన్స్ వేసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా గ్రాఫిక్స్ వర్క్ కోసం కూడా ఓ కారణం అనే టాక్ వినిపిస్తోంది. విషయం ఏదైనా నెక్స్ట్ షెడ్యూల్ లో మాత్రం సైరా పాత్రకు గెడ్డం అవసరం లేదు అని తెలుస్తోంది. ఇక ఫైనల్ గా నెక్స్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనుంది. ఇక సినిమాను భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ సుదీప్ విజయ్ సేతుపతి వంటి వారు స్పెషల్ రోల్స్ లో కనిపించబోతున్నారు.