ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘గీత గోవిందం’ సినిమాకు ఆదివారం రాత్రి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు కొన్ని రోజుల కిందట గట్టి ప్రచారమే జరిగింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా ఖండించలేదు. విశాఖపట్నంతో చిరుకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇక్కడ చిరు సినిమాలు పదుల సంఖ్యలో చిత్రీకరణ జరుపుకున్నాయి. వాటిలో చాలా వరకు సూపర్ హిట్లయ్యాయి. మెగా హీరోల సినిమాల వేడుకల్ని తరచుగా ఇక్కడ నిర్వహిస్తుంటారు. చిరు కూడా తరచుగా ఇక్కడికి వస్తుంటారు. ‘గీత గోవిందం’ కోసం కూడా చిరు అలాగే వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ ఈవెంట్లో మెగాస్టార్ కనిపించకపోవడం అభిమానుల్ని ఒకింత నిరాశకు గురి చేసింది.
ఐతే నిజానికి చిరు ఈ వేడుకకు రావాలనే అనుకున్నారట. కానీ ‘గీత గోవిందం’ నుంచి కొన్ని సన్నివేశాలు లీక్ కావడంతో ఒక్కసారిగా చిత్ర బృందమంతా షాక్ లోకి వెళ్లిపోయింది. రెండు మూడు రోజులుగా ఈ వ్యవహారం చిత్ర బృందాన్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఓవైపు రిలీజ్ వ్యవహారాలు చూసుకుంటూ.. ఇంటర్నెట్ లో ఉన్న లింకులన్నీ తీయించడమే పనిగా మారింది. మరోవైపు పైరసీని వ్యాప్తి చేసిన కుర్రాళ్లను అరెస్టు చేయించడం మీదా దృష్టిపెట్టారు. ఈ వ్యవహారాలతో అరవింద్.. బన్నీ వాసు బాగా డిస్టర్బ్ అయ్యారు. దీంతో ఒక దశలో ఈ ఈవెంటే రద్దు చేయాలని కూడా అనుకున్నారట. కానీ అలా చేస్తే ప్రమోషన్ పరంగా ఇబ్బందని భావించి ఈవెంట్ చేయడానికే నిర్ణయించుకున్నారు. లీక్ వ్యవహారంతో టీం అంతా డిస్టర్బ్ కావడంతో ఇక చిరును పిలవడం ఎందుకని అరవింద్ వెనుకంజ వేసినట్లు సమాచారం. చిరు కూడా ‘సైరా’ షూటింగులో బిజీగా ఉండటంతో ఆయన్నుంచి ఒక రోజు తీసుకోవడం ఎందుకని ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.