హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తికి డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారాలపై రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సెప్టెంబర్ 8న అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆమె బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన నేపథ్యంలో బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో రియాకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రియా బైకుల్లా జైలు నుంచి విడుదలై తన ఇంటికి చేరుకుంది.
కాగా, సుశాంత్ కేసులో రియా చక్రవర్తి డ్రగ్స్ సమకూర్చారనే ప్రధాన ఆరోపణలతో ఆమె నిషేధిత డ్రగ్స్ కోసం డబ్బు ఖర్చు చేసిందనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేశారు. ఎన్సీబీ అధికారులు వాదన ప్రకారం రియా తన క్రెడిట్ కార్డును ఉపయోగించి శ్యామ్యూల్ మిరాండా ద్వారా 5 గ్రాముల డ్రగ్స్ కోసం రూ.10 వేలు ఖర్చు చేశారు. అయితే డ్రగ్స్ సమకూర్చింది తన కోసం కాదు ఇతరుల కోసమని.. డ్రగ్స్ కోసం ఆ డబ్బును రియా నేరుగా చెల్లించినట్లు ఆధారాలు లేవని ఆమె తరఫున న్యాయవాది సతీష్ మానేషిండే కోర్టులో తన వాదనలు వినిపించారు. రియా బెయిల్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదోపవాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి రియాకు బెయిల్ మంజూరు చేయడానికి గల కారణాలు వెల్లడించారు.
ఏదైనా వ్యవహారాల కోసం డబ్బులను సమకూర్చడం ఆ వ్యవహారం కోసం ఫైనాన్స్ చేసినట్టు భావించరాదని.. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసే విషయంలో కూడా రియా చక్రవర్తి డబ్బు ఖర్చు చేయడం ఫైనాన్స్ కిందకు రాదనే అభిప్రాయాన్ని న్యాయమూర్తి వెల్లడించారట. ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ ప్రకారం నిషేదిత డ్రగ్స్ వినియోగించడం శిక్ష కిందకే వస్తుందనే విషయాన్ని నేను అంగీకరిస్తాను.. కానీ ఇతరుల డ్రగ్స్ వినియోగం కోసం డబ్బు ఖర్చు చేస్తే అది ఫైనాన్స్ చేయడం కిందకు రాదని భావిస్తానని న్యాయమూర్తి తెలిపారు. అయితే డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ లభించినప్పటికీ.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇందుకు కారణం షోవిక్ చక్రవర్తికి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే డ్రగ్ డీలర్ల ముఠాలతో సంబంధాలున్నాయని.. దానికి తగిన ఆధారాలు ఉండటం వల్లనే అతనికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదని తెలుస్తోంది. అతనికి చాలామంది డ్రగ్ డీలర్లు తెలుసు.. వారితో లావాదేవీలు జరిపేవాడు.. ఇందుకు ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వద్ద ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి తెలిపారు.