‘సైరా’ చర్చల్లో దేవిశ్రీ ఎందుకు లేడు?

Update: 2017-12-07 23:30 GMT
‘సైరా నరసింహారెడ్డి’కి ఎ.ఆర్.రెహమాన్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకుని ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం తీసుకురావాలని భావించింది చిత్ర బృందం. కానీ వారి ఆశ నెరవేరలేదు. పోస్టర్ మీద రెహమాన్ పేరు కూడా వేశాక అతను తప్పుకోవడం చిరు బృందానికి పెద్ద షాకే. రెహమాన్ కు దీటైన మ్యూజిక్ డైరెక్టర్ని సెలక్ట్ చేయడం ఇప్పుడు సవాలుగా మారింది. అసలు సంగీత దర్శకుడిని ప్రకటించకుండానే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇంతకీ రెహమాన్ రీప్లేస్మెంట్ ఎవరు అనే విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. మోషన్ పోస్టర్ కు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ వైపు దర్శకుడు సురేందర్ రెడ్డి మొగ్గు చూపుతుంటే.. రామ్ చరణ్-చిరు మాత్రం ఎవరైనా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటే నేషనల్ లెవెల్లో ప్రచారానికి పని కొస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కీరవాణి అయితే అన్ని రకాలుగా బెటర్ అన్న చర్చ కూడా నడుస్తోంది.

ఐతే ఈ చర్చల్లో ఎక్కడా టాలీవుడ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించకకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి దక్షిణాదిన తమన్.. కీరవాణిల కన్నా ఎక్కువ పాపులర్.. రీచ్ ఎక్కువ ఉన్న సంగీత దర్శకుడతను. ఫామ్ పరంగా చూసినా అతనే ముందుంటాడు. చిరుకు అతడి మీద చాలా గురి కూడా ఉంది. కానీ అతడిని ఈ సినిమాకు అసలు కన్సిడర్ కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇది దేవికి కూడా ఇబ్బందిగా అనిపించే విషయమే. దేవిశ్రీ ఎన్నో కమర్షియల్ సినిమాలకు పని చేశాడు కానీ.. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు పెద్దగా మ్యూజిక్ ఇచ్చింది లేదు. ‘పులి’ అనే జానపద చిత్రానికి సంగీతం ఇచ్చాడు కానీ.. అది అంత పేరు తెచ్చిపెట్టలేదు. పైగా అది డిజాస్టర్ అయింది. దేవిశ్రీ మ్యూజిక్ మోడర్న్ గా ఉంటుందని.. అందుకే అతను ‘సైరా’ లాంటి సినిమాలకు సరిపోయే సంగీతం ఇవ్వలేడేమో అన్న అభిప్రాయాలున్నాయి. ఐతే తమన్ పేరు పరిశీలిస్తూ.. దేవిశ్రీని మాత్రం కన్సిడర్ చేయకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Tags:    

Similar News