శాతకర్ణిని వదిలేసింది డిజె కోసమా??

Update: 2016-11-11 05:12 GMT
బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి.. శరవేగంగా సిద్ధమైపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. డిసెంబర్ లో ఆడియో రిలీజ్ చేయనున్నారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే.. అసలీ చిత్రానికి మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కానీ ఒకే సమయంలో అటు మెగా స్టార్ 150వ సినిమా ఖైదీ నెంబర్ 150.. ఇటు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి మ్యూజిక్ ఇవ్వాల్సి రావడంతో.. బాలయ్య మూవీని వదులుకున్నాడనే టాక్ ఉంది.

కానీ ఇలా శాతకర్ణిని వదిలేయడానికి కారణం మెగాస్టార్ కాదని.. బన్నీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. నిజానికి మెగాస్టార్ కి ది బెస్ట్ అందించేందుకు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిపోయాడట రాక్ స్టార్. గతేడాదే చిరు మూవీకి డీఎస్పీ సంగీతం ఖాయం చేయడంతో.. అప్పటి నుంచి రెడీ అవుతున్నాడట. చిరు సినిమా స్టార్ట్ అయ్యాక.. ఒకట్రెండు నెలలకే పాటల విషయంలో హై ఎనర్జీ బీట్స్ ఇచ్చేసిన డీఎస్పీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా అదిరిపోయే థీమ్ లను వినిపించాడట.

ఆ తర్వాత అనుకోకుండా స్టైలిష్ స్టార్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందే.. డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ ఆఫర్ రావడంతో.. బన్నీతో బోలెడంత క్లోజ్ నెస్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇటువైపే మొగ్గినట్లు తెలుస్తోంది. అలా శాతకర్ణిని వదిలేసి దువ్వాడ జగన్నాధం వైపు మొగ్గాడని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News