అప్పట్లో దిల్ రాజు ఆ మధ్య ఓన్లీ రాజు ఇప్పుడు నైజాం రాజు... అయినవాళ్లు రాజన్న అంటూ వాళ్లు తీసే ప్రతి సినిమాను రిలీజ్ కి ముందే చూపించి ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలా ప్రివ్యూలు చూసి రాజుగారికి నచ్చితే వారి బ్యానర్ లో ఆ సినిమా రిలీజ్ అయిపోతుంటుంది. ఇలా ఎన్నో సినిమాలు దిల్ రాజు రిలీజ్ చేశారు. టోటల్ నైజాం ఏరియాతో పాటు నార్త్ ఆంధ్రలో సినిమాలు డిస్ట్రీబ్యూట్ చేయడంలో దిల్ రాజు ఎక్స్ పెర్ట్. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో చాలా సినిమాలు దిల్ రాజు కాంపౌండ్ నుంచే పంపిణీ చేయబడ్డాయి. వాటిల్లో పెద్దగా ఆడని సినిమాలు దగ్గర నుంచి ఓ మోస్తారు విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి.
అయితే దిల్ రాజుకు లాభాలు తెచ్చిన సినిమా మాత్రం ఆయన బ్యానర్ లోనే నిర్మించిన ఎఫ్ 2 మాత్రమే - ఓన్ ప్రొడక్షన్స్ ఓన్ డిస్ట్రీబ్యూషన్ అవ్వడంతో ఎఫ్ 2 పై పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభం మొత్తం రాజుగారు జేబులోకే వచ్చి చేరింది. అయితే రాజగారు మిగతా డిస్ట్రీబ్యూటర్స్ మాదిరిగా సినిమాను పంపిణీ చేసి సైలెంట్ గా ఉండిపోడు - సినిమాకి హిట్ టాక్ వచ్చి కలెక్షన్స్ లో ఏదైనా తేడా వస్తే వెంటనే రంగంలోకి దిగుతాడు... సదురు సినిమా టీమ్ తో ఓ సక్సెస్ మీట్ లేదా థ్యాంక్స్ మీట్ పెట్టించి - తానే స్వయంగా ఆ ఈవెంట్ లో పాల్గోని - సినిమాని ప్రమోట్ చేస్తాడు. ఇలా ఈ ఏడాది యాత్ర సినిమా విషయంలో దిల్ రాజు చొరవ కనిపించింది. ఆ సినిమా తరువాత మళ్లీ ఇప్పుడు రాజన్న ఇన్ వాల్మెంట్ జెర్సీలో ఉండడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నాని డబ్బులు తీసుకోకుండా పనిచేశాడంటూ దిల్ రాజు స్టేట్ మెంట్ ఇవ్వడం కూడా హైలేట్ అయింది. ఈ నేపథ్యంలో రాజు పై కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. నేను లోకల్ - ఎమ్ సి ఏ వంటి సూపర్ హిట్స్ తరువాత నానితో మరో సినిమా చేసేందుకు రాజుగారు మంచి ఎత్తుగడే వేశాడని కొందరు అంటూ ఉంటే - అజ్ఞాతవాసి విషయంలో హారికా హాసిని బ్యానర్ కి దిల్ రాజుకి కొన్ని లెక్కలు పెండింగ్ ఉండంటతో వాటిని జెర్సీతో సరిచేశారని - అజ్ఞాతవాసి నష్టాల్ని జెర్సీతో రికరవరీ చేసుకోవవాల్సిదిగా రాజుకి హారికా హాసిని బ్యానర్ వారు ఆఫర్ ఇచ్చినట్లుగా తెలిసింది.
అయితే జెర్సీ రిలీజ్ కి ముందు ఈ ఆఫర్ ని తోసిపుచ్చిన దిల్ రాజు ఇప్పుడు సినిమాకి హిట్ టాక్ రావడంతో ఇప్పుడొచ్చి సెడెన్ గా మోసేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ లో నిజనిజాలేంటో ఎవ్వరికీ తెలియకపోయినా - ఊరికే మాత్రం జెర్సీని దిల్ రాజు ప్రమోట్ చేస్తున్నాడనుకోవడం హాస్యాస్పధం అవుతుంది.