మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు యావద్దేశం షాక్ తినేలా జరిగిన దారుణం తెలిసిందే. ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై లైంగిక దాడి జరిపించిన హీరో ఉదంతం పెను సంచలనంగా మారింది. బోలెండత పేరు ప్రఖ్యాతులు.. సంపద ఉన్న సదరు హీరో ఇంత ఛండాలానికి ఎందుకు పాల్పడ్డాడు. ఇంత నీచంగా ఎందుకు ఆలోచించాడు? రీల్ హీరో రియల్ విలన్ గా మారటానికి దారి తీసిన కారణం ఏమిటి? సదరు నటిపై ఇంత పగను ఎందుకు పెంచుకున్నాడు? ఎందుకోసం ఇంత దారుణానికి పాల్పడ్డాడు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.
నటి లైంగిక దాడి కేసులో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సదరు నటి మీద దాడికి కారణం ఆమెపై వ్యక్తిగతంగా పెంచుకున్న కక్షతోనే ఇదంతా చేసినట్లుగా చెబుతున్నారు. పోలీసుల ప్రాధమిక విచారణలో పలు సంచలన విషయాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
నటిపై జరిగిన దాడి తరహాలోనే దాడి చేయటం.. ఆమె నగ్న ఫోటోల్ని సేకరించేందుకు 2013లోనే ప్లాన్ చేసిన విషయంపై పోలీసులకు సమాచారం అందినట్లుగా చెబుతున్నారు. ఇందుకుగాను దిలీప్ ఒక వ్యక్తికి రూ.1.5కోట్లు ఇచ్చి నటిపై దాడి చేయాలని.. ఆమె నగ్న చిత్రాలను తనకు ఇవ్వాలని.. తనకు చేసిన ద్రోహానికి ఆమెకు ఆ శిక్ష పడాలని చెప్పినట్లుగా చెబుతున్నారు.
ఇంతకూ సదరు నటి మీద దిలీప్ ఇంతటి ఆగ్రహాన్ని పెంచుకోవటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. అతగాడి మొదటి భార్యతో వైవాహిక బంధం బ్రేక్ కావటానికి సదరు నటే కారణమని భావించటమేనని చెబుతున్నారు. కావ్యా మాధవన్ తో తనకున్న ఎఫైర్ గురించి దిలీప్ మొదటి భార్య మంజు వారియర్‌కు చెప్పటంతో దంపతుల మధ్య విభేదాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. నటిపై దిలీప్ పగ పెంచుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే దాడి చేయించారని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదటి భార్యతో వైవాహిక బంధానికి బ్రేక్ పడిన నేపథ్యంలో.. ఈ మధ్యనే కావ్యా మాధవన్‌ను దిలీప్ పెళ్లాడారు. అయితే.. తనపై వస్తున్న వాదనల్ని దిలీప్ ఖండిస్తున్నారు. తన పేరు ప్రఖ్యాతుల్ని దెబ్బ తీయటం కోసమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని చెబుతున్నారు. పోలీసుల విచారణలోనే అసలు విషయాలు బయటకు రావాలి.