జబర్ధస్త్ రమేష్ భార్య ఆత్మహత్యకు కారణం?

Update: 2016-12-21 08:34 GMT
పాతసినిమాల్లో అత్తగారి పాత్రలు కోడల్లను ముఖ్యంగా కట్నం తీసుకురాని కోడల్లను ఏ రేంజ్ లో టార్చర్ చేసేవారు చాలామంది చూసే ఉంటారు. అయితే ఆ రేంజ్ టార్చర్ కి ఏమాత్రం తగ్గకుండా అవమానాలు, వేదింపులు అనుభవించదట జబర్ధస్త్ కమెడియన్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక. అవును ఆత్మహత్య చేసుకున్న త్రిపురాంబిక వెనుక జరిగిన విషయమంతా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెళ్లడైంది! ఆమెను ఏ స్థాయిలో మానసికంగా బాదపెట్టిందీ వెలుగులోకి వస్తుంది.

పైసా కట్నం తేలేదు గానీ దర్జాగా కూర్చున్నావేంటి?... మీ అమ్మతో ఫోన్‌ లో ఏమి మాట్లాడుతున్నావ్‌.. జాగ్రత్తగా ఉండు!... అలా ఖాళీగా తిని కూర్చునే కన్నా ఇంటి పనేదైనా చేయొచ్చుగా... ఇవి త్రిపురాంబిక అత్తవారింట్లో ఎదుర్కొన్న సూటిపోటి మాటల్లో మచ్చుకు కొన్ని! ఇలాంటి వేదింపులను సుమారు ఏడాది పాటు అనుభవించి, సహించిన త్రిపురాంభిక ఇక చావే నయమనుకుంది.. బలవన్మరణానికి పాల్పడింది. సరిగ్గా ఉదయం ఆరు గంటల సమయంలో బెడ్‌ రూమ్‌ లోకి వెళ్లిన త్రిపురాంభిక ఏడున్నర అయినా బయటకు రాకపోవడంతో అత్తమామలు కిటికీలోనుంచి చూశారు. అప్పుడు వారికి ఫ్యాన్‌ కు చున్నీతో ఉరి వేసుకొని ఇంటి కోడలు కనిపించింది. దాంతో ఆమెను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.     

కాగా.. ఏడాది క్రితమే నెల్లూరుకు చెందిన త్రిపురాంబికతో రమేష్ కు పెళ్లైంది. అయితే ఆమె మరణానంతరం.. భార్యాభర్తలు బాగానే ఉన్నా అత్తమామలే వేధించారని త్రిపురాంబిక తల్లి పుష్పలత తన ఫిర్యాదులో పేర్కొంది. రమేష్ ఇంట్లో లేని సమయంలో త్రిపురాంబికను అత్త, మామ, ఆడపడుచు, ఆమె భర్త కలిసి మానసికంగా వేధించారని ఆమె గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై స్పందించిన పోలీసులు ప్రాథమికంగా వరకట్న వేధింపులే త్రిపురాంబిక ప్రాణాలు తీశాయని తేలిందని, అయితే మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News