కంగనా నోటికి తాళం పడిపోయింది

Update: 2017-10-07 15:30 GMT
హృతిక్ రోషన్-కంగనా రనౌత్ గొడవకు చాన్నాళ్ల కిందటే తెరపడినట్లు కనిపించింది. ఓ దశలో పోలీసుల వరకు వెళ్లిన ఈ వ్యవహారం దాదాపుగా సద్దుమణిగినట్లే అనిపించింది. కానీ ఈ ఏడాది తన కొత్త సినిమా ‘రంగూన్’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో కంగనా.. హృతిక్ మీద సంచలన ఆరోపణలు చేసి ఈ తేనెతుట్టెను మళ్లీ కదిపింది. కొంచెం బ్రేక్ ఇచ్చి తన లేటెస్ట్ మూవీ ‘సిమ్రాన్’ రిలీజవుతున్నపుడు కూడా మళ్లీ హృతిక్ ను టార్గెట్ చేసింది. ఐతే తన కొత్త సినిమాలు రిలీజవుతున్నపుడే కంగనా ఇలా హృతిక్ ను లక్ష్యంగా చేసుకుంటుండటంతో ఆమె క్రెడిబిలిటీ దెబ్బ తింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందన్న అభిప్రాయం జనాల్లో కలిగింది. పైగా ఇప్పుడు హృతిక్ గట్టిగా రిటార్ట్ ఇస్తూ కంగనాను టార్గెట్ చేసుకున్నాడు. దీంతో ఆమె ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది.

ఇంతకుముందు హృతిక్ కు మాటకు మాట సమాధానం ఇస్తూ.. అతడిపై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేసిన కంగనా ఇప్పుడు ఉన్నట్లుండి సైలెంటైపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదని సమాచారం. కంగనా 2015లో ‘తను వెడ్స్ మను-2’తో హిట్టు కొట్టాక ఆమె సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ ఏడాది ‘రంగూన్’.. ‘సిమ్రాన్’ దారుణమైన ఫలితాలు చవిచూశాయి. ఈ సినిమాల విడుదలకు ముందు కంగనా.. హృతిక్ ను లక్ష్యంగా చేసుకోవడంతో మీడియాలో అంతా దాని గురించే చర్చ జరిగింది. ఈ సినిమాల గురించి అంతా మరిచిపోయారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ సినిమాల ఫలితాలు కంగనా కొత్త సినిమా ‘మణికర్ణిక’ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని.. ఈ సినిమాకు ఫైనాన్స్ చేస్తున్న వాళ్లు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని బెదిరిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హృతిక్ తో వివాదాన్ని సాగదీయడం వల్ల కంగనా షూటింగులో కూడా ఏకాగ్రత చూపించలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రభావంతో హైదరాబాద్ లో ‘మణికర్ణిక’ షెడ్యూల్ అర్ధంతరంగా ముగిసినట్లు కూడా చెబుతున్నారు. దీంతో చిత్ర బృందం ఆమె నోటికి తాళం వేయించిందని.. ఈ వివాదాన్ని ఇక్కడిత వదలకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కంగనను హెచ్చరించడంతో ఆమె నోటికి తాళం పడ్డట్లు సమాచారం.
Tags:    

Similar News