​లాప్ టాప్ లో దొరికిన హీరోయిన్

Update: 2017-08-08 07:41 GMT
సినిమాలో అవకాశాలు ఎప్పుడు ఎవరిని ఏ విదంగా వరిస్తాయో చెప్పలేము. మోడల్గా చేస్తూ ఒక్కసారిగా హీరోయిన్ అయి స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న హీరోయిన్లు చాల మంది ఉన్నారు మన ఇండస్ట్రిలో . ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లు కూడా నటి అవ్వాలని వచ్చిన వాళ్ళు కాదు మోడల్ గా వచ్చి నటి అయినవారే. అలానే మన తెలుగులో కూడా కొంతమంది హీరోయిన్లకు వాళ్ళు కూడా ఊహించని విదంగా అవకాశాలు వచ్చి స్టార్ అయిపోయారు. ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్  కూడా కొంచెం వింతగా అవకాశం పట్టేసింది.

లై సినిమాలో హీరోయిన్ ని ఎలా ఎన్నుకున్నారు ఆమె కి ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది అనేది చాలామంది ప్రశ్న. దీనికి లై సినిమా హీరో నితిన్ వివరించాడు అసలు కథను. నితిన్ మాట్లాడుతూ “ అసలు లై టీమ్ కాదు మేఘా ఆకాష్‌ ని వెతికిపట్టింది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఒక సారి హైదరాబాద్ వచ్చినప్పుడు తన లాప్ టాప్ లో మేఘా ఫోటోలను చూపించారు. నేను మా సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి కి చూపిస్తే అతను కూడా సరే అన్నాడు. అంతే కాకుండా లై సినిమా షూటింగ్ కోసం యూ‌ఎస్ లో ఏకదాటిగా 75 రోజులు షూటింగ్ చేయవలిసి వచ్చింది. నాకు తెలిసి ఏ స్టార్ హీరోయిన్ దగ్గర అన్నీ రోజులు వరుస డేట్స్ దొరకవు'' అని చెప్పాడు. కాబట్టి ఇలా మా టీమ్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది అని వివరించాడు. థ్యాంక్స్ టు డైరెక్టర్ గౌతమ్ మీనన్ అని చెప్పాడు.

తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఏదో సినిమా కోసం మేఘా పని చేయవలిసి ఉంది. ఇప్పుడు అయితే మేఘా హీరోయిన్ గా నటిస్తున్న నితిన్ హీరోగా చేసిన లై సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అలా ఒక లాప్ టాప్ లో ఉన్న ఫోటోలు మేఘా ఆకాష్  ని తెలుగు  హీరోయిన్ గా మార్చింది.  
 ​
Tags:    

Similar News