అక్కడ ముందే థియేటర్లు ఓపెన్.. మనకు లేట్

Update: 2020-04-19 03:30 GMT
కరోనావైరస్ కారణంగా తీవ్ర నష్టాలకు గురవుతున్న రంగాలు చాలానే ఉన్నాయి. అందులో సినిమా రంగం కూడా ఉంది.  ఒకవైపు సినిమా షూటింగులు ఆగిపోయాయి. మరోవైపు థియేటర్లు మూతపడడంతో కొత్త సినిమాల రిలీజులకు అవకాశం లేకుండాపోయింది. భారతదేశంలో దాదాపుగా నెల రోజులకు పైగా సినిమా హాల్స్ మూతపడ్డాయి.  ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? మే 3 న లాక్ డౌన్ విరమణ ప్రకటిస్తే సినిమా థియేటర్లు రీ ఓపెన్ చేసేందుకు అనుమతినిస్తారా అనేది గ్యారెంటీ లేదు.

ఇండియాలో దశల వారీగా లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తారని.. సినిమా థియేటర్లను తెరిచే అవకాశం చివరి దశలోనే ఉంటుందని అంటున్నారు.  ఈలెక్కన లాక్ డౌన్ విరమణ తర్వాత కూడా కొన్నివారాల పాటు మనదేశంలో థియేటర్లను ఓపెన్ చెయ్యరు.  అయితే అమెరికాలో మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంటుందని సమాచారం. అక్కడ షట్ డౌన్ ను మూడు దశలలో సడలిస్తారని.. .మొదటి దశలోనే థియేటర్లను తెరిచేందుకు అనుమతినిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే భారీ నష్టాలతో అమెరికాలో కొన్ని సినిమా థియేటర్ల చైన్ కంపెనీలు దివాలా అంచున ఉన్నాయి.  ఈ లిస్టులో అతి పెద్ద కంపెనీ AMC కూడా ఉందట.  అయితే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థను కాపాడడమే తన ప్రయారిటీ అంటున్నారు కాబట్టి అక్కడ సినిమా రంగం ఊపిరి పీల్చుకోవచ్చు. మరి ఇండియాలో పరిస్థితి ఎలా ఉండబోతోందనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.
    

Tags:    

Similar News