నాగ్ చెప్పింది చేయలేదా?

Update: 2019-04-14 05:52 GMT
ఇటీవలే జరిగిన ఎన్నికలు ఎంతటి సంచలనాలకు చర్చకు దారి తీశాయో ప్రత్యక్షంగా గమనించాం. ఊహించని విధంగా జనంలో కూడా చైతన్యం వచ్చి అధిక శాతం కేంద్రాల్లో 80 శాతం ఓటింగ్ నమోదు చేసి రికార్డులు సృష్టించారు. ఇందులో ప్రభుత్వంతో పాటు సెలెబ్రిటీల పాత్ర కూడా కీలకంగా ఉంది. చిరంజీవి మొదలుకుని చిన్నా చితకా ఆర్టిస్టుల దాకా అందరూ సామజిక బాధ్యతలో భాగంగా ఓట్లు వేసి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.

కానీ కింగ్ నాగార్జున మాత్రం ఈ సందడిలో ఎక్కడా కనిపించలేదు. నాగ చైతన్య సమంతా జంటగా వచ్చి ఓట్లు వేశారు కానీ కింగ్ మాత్రం జాడ లేడు. కారణం మన్మధుడు 2 షూటింగ్ కోసం పోర్చుగల్ లో ఉండటమే. ఎవరెవరో స్థోమతతో సంబంధం లేకుండా విమాన ఖర్చులు పెట్టుకుని మరీ విదేశాల నుంచి వచ్చి ఓట్లేసి వెళ్తుంటే అంత పెద్ద స్టార్ అయిన నాగార్జున ఓటు వేయలేదా అంటూ నెటిజెన్లు నిలదీస్తున్నారు

నిజానికి నాగ్ వచ్చి వెళ్లడం పెద్ద భారమేమి కాదు. చాలా ఈజీ. పైగా నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన అతి కొద్దీ మంది ప్రముఖుల్లో నాగ్ కూడా ఉన్నాడు. అలాంటప్పుడు ఓటు  వేస్తే అభిమానుల్లోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లో సైతం ఓ బలమైన నమ్మకం ఏర్పడుతుంది. కానీ నాగ్ ఆ పని చేయలేదు. పదే పదే బాధ్యతల గురించి వివరించే నాగార్జున ఇలా చేస్తారా అంటూ సోషల్ మీడియాలో సైతం ట్రాలింగ్ జరిగింది. షూటింగ్ ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చిందని కొడుకు కోడలు వేశారు అని సమర్ధించుకోవడానికి లేదు. ఒక్క ఓటు నాయకుల భవితవ్యాలను నిర్దేశిస్తున్న తరుణంలో ఓటు వేసి ఉంటె బాగుండేదేమో నాగ్.
    

Tags:    

Similar News