మాటిచ్చి హ్యాండిచ్చాడా రాజు??

Update: 2017-08-03 18:08 GMT
ఈ శుక్రవారం సంగతి పక్కన పెట్టేస్తే వచ్చే శుక్రవారం గురించి ఇప్పుడు చాలా తీవ్రంగా ఫిలిం ఇండస్ర్టీలో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాలు అయితే.. ఒకేసారి నేనే రాజు నేనే మంత్రి.. లై.. జయ జానకి నాయక సినిమాలను రిలీజ్ చేయడం సమంజసం కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలూ ఒకేసారి వచ్చి ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను క్యాస్‌ చేసుకోవాలని చూస్తున్నా కూడా.. అదెందుకు అంత సింపుల్ కాదో ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి ఒకేసారి మూడు సినిమాలు అంటే.. ఆ మూడింటిలో దేనికి ఎక్కువగా బజ్ ఉంటే దానికి ఎక్కువ ధియేటర్లు దొరుకుతాయి. అయితే ఇక్కడ మూడు సినిమాలకూ సరిసమానమైన బజ్ ఉండనే ఉంది. అందుకే మూడు సినిమాలకూ సమానంగానే దియేటర్లు దొరుకుతున్నాయి. కాని అందుకు కారణం బజ్ కాదండోయ్.. అక్కడున్న పెద్దాళ్ళు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి.. రానా వాళ్ల డాడీ సురేష్‌ బాబు.. అలాగే బెల్లకొండ సురేష్‌.. ధియేటర్లను దక్కించుకోవడంలో నిష్ణాతులు. వీళ్ళలో సురేష్‌ బాబుది ఒక ఏరియాలో పైచేయి ఉంటే.. వేరే వారిది వేరే ఏరియాల్లో పైచేయి. అందుకే అందరూ ధియేటర్లను పొందేశారు. కాకపోతే ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉందట.

అసలు నేనే రాజు నేనే మంత్రి సినిమాను ఆగస్టు 11 నుండి పోస్టుపోన్ చేస్తామని అందరికీ చెప్పారట. దానితో జయ జానకి నాయక వారు ముందుగా కన్ఫామ్ చేశారట. ఆ తరువాత నితిన్ లై కూడా మంచి ధియేటర్లను ఎంచుకునే పనిలో ఉండగా.. తమిళంలో వివేగం సినిమాను ఆగస్టు 24న తెస్తున్నారు కాబట్టి.. 11నే రెండు చోట్లా నేనే రాజు నేనే మంత్రి తెచ్చేస్తే బెటర్ అనే ప్లానుతో మనోళ్లు మల్ళీ పాత తేదీకే వచ్చేశారట. కాని ఇక్కడదాకా వచ్చాక ఇప్పుడు లై అండ్ జయ జానకి ఎందుకు తగ్గుతాయ్.. అందుకే ఇప్పుడు మూడు సినిమాలూ ఒకదానితో ఒకటి తలపడుతున్నాయ్.
Tags:    

Similar News