ఇండియాలోనే భారీ యాక్షన్ స్టార్ గా పాపులరయ్యాడు ప్రభాస్. బాహుబలి 1 - బాహుబలి 2- సాహో చిత్రాలతో యాక్షన్ రారాజుగా వెలిగిపోయాడు. అందుకే అతడి నుంచి రాధేశ్యామ్ లాంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రం వస్తుందని రెగ్యులర్ ఆడియెన్ ఊహించి ఉండరు. రాధేశ్యామ్ ప్యూర్ లవ్ స్టోరితో విజువల్ గ్లింప్స్ ఆధారంగా రూపొందిన చిత్రం. నెగెటివ్ అంశాలు వదిలేస్తే ఈ సినిమాలో విజువల్స్ ఎంతో అందంగా కుదిరాయని ప్రశంసలు దక్కాయి.
తాజాగా జాతీయ మీడియా ఇంటర్వ్యూలో రాధేశ్యామ్ సినిమాలో నటించాలనుకోవడానికి కారణమేమిటో ప్రభాస్ చెప్పారు. తన యాక్షన్ ఇమేజ్ కి దూరంగా ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నానని రాధేశ్యామ్ లవ్ స్టోరీ అంగీకరించడానికి కారణమిదేనని తెలిపాడు. రాధే శ్యామ్ కూడా థ్రిల్లర్ అంశాలతో కూడినది. రెట్రో విజువల్స్ వెరైటీ డ్రెస్ లు కలర్ మిక్స్ తో భారతదేశపు మొదటి చిత్రం అని చెప్పారు.
నేను యాక్షన్.. యాక్షన్ ..యాక్షన్ లాంటివి కాకుండా భిన్నమైనదాన్ని చేయాలనుకున్నాను... భవిష్యత్తులో నేను మరిన్ని ప్రయోగాలు చేయగలిగేలా విభిన్నంగా ఏదైనా చేయాలనుకున్నాను. కాబట్టి ప్రేమకథ లేదా వేరే ఏదైనా చేయాలని అనుకున్నాం. నేను నాలుగైదు స్క్రిప్ట్ లు విన్నాను. చివరికి దీన్ని చేయడానికి ప్లాన్ చేసాను.. ప్రభాస్ అన్నారు.
రాధా కృష్ణ కుమార్ రచించి దర్శకత్వం వహించిన 'రాధే శ్యామ్' ఒక పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా. ఇది విధి ఆడే వింత డ్రామాతో సాగే కథాంశం. ప్రేరణ పట్ల అతని ప్రేమకు మధ్య సంఘర్షణలో ఉన్న విక్రమాదిత్య అనే పామరుడి కథ చుట్టూ తిరుగుతుంది. పూజా ప్రేరణ అనే పాత్రను పోషించింది.
వ్యక్తిగత జీవితంలో ప్రభాస్ హస్తసాముద్రికం జ్యోతిష్యం నమ్ముతాడా? అని అడిగితే .. నేను అలాంటి వాటిని అనుసరించలేదు. మనం చాలా కథలు విన్నాం... మా కుటుంబంలో కూడా చాలా కథలు విన్నాం... ఇలా జరుగుతుందని ఈ హస్తసాముద్రికం చెబుతుంది. మా అమ్మానాన్న అందరూ `నేను పుట్టాక పెద్దవాడు అవుతాడు` అన్నారు కానీ నేను ఏ హస్తసాముద్రికం లేదా జ్యోతిష్యం ని అనుసరించాలనుకోలేదు... మనకు భారతదేశంలో జ్యోతిష్యంలో గొప్ప సంస్కృతి ఉంది.. కానీ నేను ఎప్పుడూ అనుసరించలేదు అని అన్నారు.
ప్రభాస్ గతంలో రెండు రొమాన్స్ కాన్సెప్ట్ చిత్రాలను చేసాడు. డార్లింగ్ -మిస్టర్ పర్ఫెక్ట్ ఈ కేటగిరీకే చెందుతాయి. రొమాన్స్ కాన్సెప్ట్ వైపు తనను ఆకర్షిస్తున్న అంశమేమిటో ప్రశ్నిస్తే.. అతను ఇలా అన్నాడు: “నేను తెలుగులో రెండు రొమాంటిక్ లవ్ స్టోరీ లు చేసాను.. నాకు మంచి యాక్షన్ ఇమేజ్ ఉంది.. అందుకు విభిన్నంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను.. అని ప్రభాస్ అన్నారు. బాహుబలి తర్వాత… చిన్న బడ్జెట్ తో ప్రేమకథతో వెళ్లడం మంచిదని మేము అనుకున్నాము.
నాకు సరైన స్క్రిప్ట్ లభించలేదు అప్పుడు సాహో చేశాను. రాధే శ్యామ్ కోసం మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. మూవీలో డ్రామాను జోడించాం అని తెలిపారు. “ఇది ఒక విధంగా లవ్ థ్రిల్లర్. భారతీయ-సినిమాలో మొదటిసారి - రెట్రో తరహా ప్రేమకథాచిత్రం అని అన్నారు.
రెట్రో విజువల్స్ లేదా డ్రెస్సులు లేదా కలర్ మిక్స్ తో భారతీయ సినిమాని ఎప్పుడూ చూడలేదు.. అని అన్నారు. రాధేశ్యామ్ కి మిశ్రమ స్పందనలు వచ్చాయి. హిందీలో యావరేజ్ అనే టాక్ వచ్చినా అక్కడ మంచి వసూళ్లను సాధించేందుకు ఆస్కారం ఉంది.