పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేయడానికి ఎంత మంది ఎదురు చూస్తుంటారో.. అతను సరే అంటే ఎన్ని కథలు రెడీ అవుతాయో.. అనుకుంటారు అందరూ. కానీ తాను సినిమా చేయడానిక రెడీగా ఉంటే.. ఎవ్వరూ తన కోసం కథలు సిద్ధం చేయలేదని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథను స్వయంగా రాయడానికి కారణం అడిగితే వేరే ప్రత్యామ్నాయం లేకే తాను కలం పట్టాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత తనతో హీరోగా సినిమా చేయడానికి రెండేళ్ల పాటు ఎవ్వరూ ముందుకు రాలేదని పవన్ చెప్పాడు. చివరికి తన మిత్రుడు త్రివిక్రమ్ కూడా ఈ విషయంలో వెనకడుగు వేశాడని పవన్ అన్నాడు. తన ప్రతి సినిమాకూ అంచనాలు పెరిగిపోతుండటంతో.. ఆ ఒత్తడిని తట్టుకోలేకే తనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదేమో అని పవన్ అభిప్రాయపడ్డాడు.
రెండేళ్లు ఎదురు చూశాక.. ఇక తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి.. స్టాఫ్ ను మెయింటైన్ చేయడానికి.. సినిమా చేయక తప్పదు కాబట్టి తాను ముందు అనుకున్న కథనే బయటికి తీసి స్క్రిప్టు తయారు చేసి సినిమా తెరకెక్కించాల్సి వచ్చిందని పవన్ చెప్పాడు. చివరగా అవసరం వల్లే తాను కలం పట్టి కథ రాయాల్సి వచ్చిందని ముక్తాయించాడు పవన్.