2.0 లికేజ్.. అంతా వాళ్ల ప్లానేనా?

Update: 2018-03-05 17:20 GMT
గత కొంత కాలంగా కొంత మంది సినిమా వాళ్లు సినిమాపై అంచనాలు బాగా పెరగాలని కొన్ని కొత్త దారులను ఎంచుకుంటున్నారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రచారం జరగాలి. జనాలు అదే విషయంపై మాట్లాడుకోవాలి. ఏం చేసినా వైరల్ అయ్యేలా చేయాలి. ఈ తరహ ఆలోచన ఇప్పుడు చాలా మందిలో ఉంది. దీంతో ఎదో ఒక విధంగా కాంట్రవర్షియల్ న్యూస్ ని బాగా క్రియేట్ చేసి సినిమా మార్కెట్ పెంచాలని అనుకుంటున్నారు.

ఇప్పుడు అదే తరహాలో ఒక 2.0 సినిమా యూనిట్ కూడా నాటకం ఆడారా అని టాక్ వస్తోంది. ఈ అనుమానం ఇప్పుడు కోలీవుడ్ లో విమర్శకులకు బాగా ఎక్కేసింది. ఎందుకంటే రీసెంట్ గా సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఫుటేజ్ లీక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్నా కూడా ఇంకా ఆ వివాదం ఓ కొలిక్కి రాలేదు. అనుమానాలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్ కోసమే చిత్ర యూనిట్ ఆ విధంగా ట్రైలర్ లీక్ చేసిందా అని డౌట్ వస్తోంది. రజినీకాంత్ కెరీర్లోనే బారి బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే.

అయితే సినిమా రిలీజ్ డేట్ గత ఏడాది నుంచి వాయిదాల పర్వంతో కొనసాగుతోంది. ఏప్రిల్ 27న ఫైనల్ అనుకున్నప్పటికి ఆ సమయంలో కాలా వచ్చి చేరింది. దీంతో అభిమానులు సినిమా విడుదలపై ఆశలు వదులుకున్నారు. దేనికైనా ఓ ఓపిక ఉంటుంది. మితిమీరిన ఓపిక ఏ మాత్రం మంచిది కాదు. 2 0 విషయంలో అది జరగకూడదని ట్రైలర్ లికేజ్ ప్లాన్ చేశారేమో అనే అనుమానాలు ఇప్పుడు జనాల్లో మెదులుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి చిత్ర యూనిట్ ఈ కామెంట్స్ పై స్పందిస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News