ఈ జనసేన ప్రచారం ఏంది చరణ్‌?

Update: 2017-03-22 08:27 GMT
''మీరు (విద్యార్ధులు) అనుకుంటే ఎవ్వరైనా కూడా సూపర్ స్టార్ అవ్వొచ్చు. ఇండియాలో అలా చాలామంది స్టార్లు అయ్యారు. అలాగే మీరు అనుకుంటే ఒక పార్టీ పవర్ లోకి రావొచ్చు. ఒక రాజకీయ నాయకుడు గెలిచి పెద్ద లీడర్ అవుతాడు'' అంటూ మొన్న అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో రామ్ చరణ్‌ చెబుతుంటే.. అందరూ ఊర్రూతలూగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇదేదో ''జనసేన'' సినిమాకు కట్ చేసిన ఒక టీజర్ లా ఉందంటున్నారు విశ్లేషకులు.

''ఏ స్టేట్ లోనైనా మోస్ట్ పవర్‌ ఫుల్ పీపుల్ ఎవరంటే.. స్టూడెంట్సే అంటారు. అందుకే స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. మీ కాలేజీవారు అడ్మిషన్ ఇస్తే నేను ఇక్కడే స్టూడెంటుగా చేరిపోతాను'' అంటూ మరో స్టెట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే  బాబాయ్ పవన్ కళ్యాణ్‌ పెట్టిన ''జనసేన'' పార్టీలో మనోడు స్టూడెంట్ వింగ్ కు నేతృత్వం వహిస్తున్నాడనే ఫీలింగ్ రావట్లేదూ? అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ''ఏ కాలేజీలోనైనా అటెండెన్స్ ఎక్కువగా ఉంటుందంటే.. ఖచ్చితంగా గాళ్స్ వలనే. వాళ్లు కాలేజీకి వస్తే.. బాయ్స్ అందరూ వస్తారు'' అని చెబుతూ నవ్విస్తూ.. స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా ప్రేమిస్తారని.. వారు తమ 'పవర్' ను సరిగ్గా వాడుకోవాలని.. సినిమాల కోసమే కాదు.. ఇతరవాటిలో కూడా ఈ పవర్ ను సరిగ్గా వాడుకోవాలని రామ్ చరణ్‌ పదే పదే చెబుతుంటే.. మీరు 2019లో జనసేనకే ఓటేయండి అన్నట్లుంది కదూ!!

ఓ రకంగా చూస్తుంటే 2019 ముందు 'మెగా' రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతాయేమో అనే డౌట్ కూడా వస్తోంది. అయినా మొన్ననే పవన్ నా దారిలోకి అన్నయ్య.. అన్నయ్య రూట్లోకి నేను వెళ్లడం జరగదు అంటూ బాగానే క్లారిటీ ఇచ్చేశాక.. ఇప్పుడు చరణ్‌ డాడ్ ను వదిలేసి బాబాయ్ తో జనసేనలోకి దిగడనే అనుకోవాలి. కాబట్టి.. తను సరదాగా ఇచ్చిన స్పీచులో జనసేన ప్రచారం ఏం లేదనే అనుకుందాం. ఏమంటారు గయ్స్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News