కత్రినా - రణ్‌బీర్‌ మధ్యలో ఎవరు?

Update: 2016-09-09 06:07 GMT
కత్రినా - రణ్‌ బీర్‌ ల ప్రేమ విఫలమవడంపై రకరకాల గాసిప్పులు పుట్టుకొచ్చాయి. వీరి బ్రేక్ అప్ పై ఇప్పటికే వచ్చిన కథనాల సరసన చేరింది కొత్త గాసిప్ ఒకటి. అయితే ఇది గాసిప్ కాదు వాస్తవమే అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈ విషయాలపై ఇప్పటికే స్పందించిన కత్రినా.. తమ బ్రేక్ అప్ విషయాలు మీడియా ఎప్పటికీ డిస్కస్ చేస్తూనే ఉంటే.. తమ కథ ఎప్పటికీ ఆగదని చెబుతూ.. దయచేసి ఇంకెప్పుడూ బ్రేకప్ కి గల కారణాల గురించి అడగవద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ విజ్ఞప్తి అలా ఉంటే.. వీరి బ్రేకప్ కి కారణం మాత్రం ఇదే అంటున్నాయి బీ-టౌన్ మీడియా వర్గాలు.

కత్రినా - రణ్‌ బీర్ ల బ్రేకప్ గురించి ఇప్పటికే బాలీవుడ్ జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్న దశలో.. "కత్రినా నాకు చాలా ప్రత్యేకమైంది.. అమ్మానాన్నల తర్వాత నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆమె.. బ్రేకప్ తనను, నన్నూ బాగా అప్‌ సెట్ చేసింది.. నేను ఇప్పటివరకూ ఎక్కువగా తాగేవాడిని కానీ నా ప్రేయసి కోసం మానేయాలనుకుంటున్నాను" అని రణ్‌ బీర్ వ్యాఖ్యానించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఈ మాటలు విన్నవారంతా కత్రినాకు దగ్గరయ్యేలా రణ్‌ బీర్ ప్రయత్నాలు మరలా ముమ్మరం చేశాడని భావిస్తున్నారు.

అయితే సాధారణంగా ప్రేమ విఫలమయిన వారు నిత్యం మద్యంతో సావాసం చేస్తూ దేవదాసులా మారుతుంటే.. రణ్ బీర్ మాత్రం సక్సెస్ ఫుల్ గా ప్రేమలో ఉన్నా కూడా మందు ను వదిలేవాడు కాదట. ఇది ఏమాత్రం నచ్చని కత్రినా.. చాలా సార్లు చెప్పి చూసి, ఇక విసుగొచ్చి విడిపోయిందని చెబుతున్నారు బి-టౌన్ మీడియా జనాలు. ఇదిలా ఉంటే రణ్ బీర్ తో బ్రేకప్ తర్వాత కత్రినా - హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు దగ్గరైందని అంటున్నారు. కాబట్టి ఇక రణ్‌ బీర్‌ కు దగ్గరయ్యే అవకాశలు లేవనేది వారి వాదన. మరి.. కత్రినా - రణ్ బీర్ ల బ్రేకప్‌ కి ఆ మందే కారణమా? లేక సిద్దార్థ్ మల్హోత్రా కారణమా అనేది వారికే తెలియాలి!
Tags:    

Similar News