చాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ ప్రేమాయణాలు అతడిని బొమ్మాళీలా వెంటాడుతున్నాయి. నిను వీడని నీడను నేను అన్న చందంగా జీవితాంతం విడిచిపెట్టేట్టు లేవు. మాజీలంతా అతడిని ఏదో ఒక రకంగా ఆడుకుంటున్నారు. తలచితలచి కుమిలిపోయేలా వేధిస్తున్నారు. ప్రస్తుతం దీని పై బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వీలున్న ప్రతి సందర్భంలో సూటి పోటి మాటలతో, తమ యాక్టివిటీస్ తో కుర్రహీరో గుండెకు చిల్లు పెడుతున్నారు.
ఇప్పటికే ఇద్దరు భామలతో ప్రేమలో పడి రెండు సార్లు బ్రేకప్ అయ్యి ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నాడు రణబీర్. మొదటిసారి దీపికను ప్రేమించాడు. వైఫల్యం ఎదుర్కొన్నాడు. ఇటీవలే రణవీర్ సింగ్ ని పెళ్లాడిన దీపిక తన వివాహానికి, రిసెప్షన్ కు ఆహ్వానించినా రణబీర్ ఎగ్గొట్టాడని, అతడి మనస్తత్వం అంతేనని సూటి పోటి మాటలతో తూలనాడింది. అది చాలదన్నట్టు తాజాగా మరో పరాభవం రణబీర్ కి ఎదురైంది.
మరో మాజీ ప్రేయసి కత్రిన సైతం అతడిని వేరొక కోణంలో మనో వేదనకు గురి చేయడం చర్చకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ నటించిన `జీరో` కథాంశం ప్రస్తుతం హాట్ టాపిక్. ఇందులో కత్రిన తన నిజ జీవిత పాత్రను తెర పైనా పోషించింది. ఒక అందాల కథానాయిక జీవితంలో ప్రేమ విఫలమయ్యాక ఆల్కహాల్ బారిన పడుతుంది. ఆ క్రమంలోనే తన ఆవేదనను తెర పై ఎమోషనల్ గా చూపించారు. కత్రిన నిజజీవితంలోనూ రణబీర్ తో సాగించిన ఎఫైర్ ని, ప్రేమ విఫలమయ్యాక మందు సీన్లను తెర పై చూపించారట.
దీంతో తొలుత జీరో చిత్రాన్ని చూడాలనుకున్న రణబీర్ తన స్నేహితులు వారించడంతో ఆ ఆలోచనే విరమించుకున్నాడట. ఇక జీవితంలో ఎప్పటికీ `జీరో` చిత్రం చూడకూడదని నిర్ణయించుకున్నాడట. కత్రిన జీవితాన్ని యథాతథంగా చూపిస్తే తనను హర్ట్ చేసే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉండి ఉంటాయని రణబీర్ భావిస్తున్నాడట. ఇలాంటి సందిగ్ధావస్త పగోడికైనా రాకూడదన్న చర్చా సాగుతోంది. ప్రస్తుతం ఈ చాక్లెట్ బోయ్ యువ కథానాయిక ఆలియా భట్ తో డీప్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే.