12 కోట్ల కోసమే కక్కుర్తి పడ్డాడా?

Update: 2018-05-28 04:04 GMT
మాస్ మహరాజా రవితేజ లేటెస్ట్ మూవీ నేలటిక్కెట్టు సగటు ప్రేక్షకుడినే కాదు.. అతడిని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ కు కూడా ఏ మాత్రం నచ్చలేదు. అరిగిపోయిన కథ.. ఏ మాత్రం ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లేతో వచ్చిన ఈ సినిమా చూసిన వారందరికీ కలిగిన సందేహం ఒక్కటే... ఈ కథలో ఏం చూసి రవితేజ ఇష్టపడ్డాడు? అసలు ఏం ఉందని ఈ సినిమా చేశాడు అనే?

నేలటిక్కెట్టు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ స్టోరీని మిగతా కొందరు హీరోలకు వినిపించాడు. వాళ్లెవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో చివరకు మాస్ మహరాజా దగ్గరకు వచ్చింది. ఈ స్టోరీ విన్నాక పెద్దగా ఆడదని తెలిసీ అతడు హీరోగా నటించడానికి ఓ కారణం ఉందనేది రవితేజ సన్నిహితుల మాట. అదేమిటంటే ఈ మూవీ చేయడానికి వచ్చిన రెమ్యునరేషన్. రవితేజ కెరీర్ లోనే హయ్యెస్ట్ గా దాదాపు రూ. 12 కోట్లు ఆఫర్ చేశారట. అంత భారీ మొత్తం అనేసరికి కాదనడం ఎందుకని ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. నేలటిక్కెట్టు సినిమా చూశాక రెమ్యునరేషన్ తప్ప అందులో ఓ హీరోని ఇంప్రెస్ చేసే అంశాలే లేవని ఎవరైనా ఒప్పుకుంటారు.

నేలటిక్కెట్టు రిజల్ట్ తేడాగా ఉంటుందని రిలీజ్ కాకముందే రవితేజ డిసైడైపోయాడట. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు.  ఏదో చెప్పాలి కాబట్టి అన్నట్టుగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు చేసి సరిపెట్టేశాడు. ఎన్ ఆర్ ఐ బిజినెస్ మేన్ రామ్ తాళ్లూరి నేలటిక్కెట్టు సినిమాకు ప్రొడ్యూసర్. రూ. కోట్లు పోసి హీరో డేట్లు పట్టాడే కానీ కథ గురించి పట్టించుకున్నట్టు లేడు.
Tags:    

Similar News