దశలవారిగా ఒక్కో అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నారా నందమూరి కుటుంబాలు అడ్డుకుంటాయేమోనన్న వర్మ అభిమానుల భయాలకు ఆల్మోస్ట్ చెక్ పడినట్టే కనిపిస్తోంది. కారణం వాళ్ళెవరూ కోర్ట్ కు వెళ్లే ఉద్దేశంలో లేరట. ఎందుకనే సందేహం రావొచ్చు. ఎన్నికల ప్రకటన వచ్చేసింది కాబట్టి ఈ నెల రోజులు రాజకీయ పార్టీలకు చాలా కీలకం. లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద కేసు వేయాలంటే ముఖ్యంగా ఇద్దరు చేయాలి.
ఒకరు చంద్రబాబునాయుడు. రెండు బాలకృష్ణ. ఇప్పుడు కేసులు వేసి వాదనలు ప్రతివాదనలు దాని మీద చర్చలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు వీటి మీద టైం వేస్ట్ చేసేంత సీన్ వీరికి లేదు. అధికారాన్ని నిలబెట్టుకుని తిరిగి కుర్చీలో కూర్చోవడం మీద చంద్రబాబు నాయుడు దృష్టి ఉండగా ఎమ్మెల్యేగా మళ్ళి గెలవాల్సిన బాధ్యతను మోస్తున్న బాలకృష్ణ దాంతో పాటు స్టార్ క్యాంపైనర్ గా రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉంటుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది వీళ్లకు టాపిక్కే కాదని ఇన్ సైడ్ న్యూస్
పోనీ మిగిలిన కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా వేయించి అడ్డుకోవచ్చుగా అంటే దానికీ బాబు నో చెప్పినట్టు సమాచారం. వర్మ లాంటి వాళ్ళు ఇలాంటి రియాక్షన్ల కోసమే ఎదురు చూస్తుంటారని ఏ అడుగు వేసినా అది పబ్లిసిటీ కోసం వాడుకుని తన సినిమాకే లాభం కలిగేలా చేసుకుంటాడు కాబట్టి అసలు మనకా సినిమా సంగతే తెలియదు అన్నంత సైలెంట్ గా ఉందామని ఓ నిర్ణయానికి వచ్చారట.
ఇది నిజమైతే 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ రావడం పక్కానే. సెన్సార్ ఫార్మాలిటీ ఒక్కటి పూర్తయిపోతే ఇక నిశ్చింతగా ఉండొచ్చు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ట్రైలర్స్ లో చూపించిన కంటెంట్ ఉంటే వర్మకు మొదటి హిట్ దక్కడం ఖాయం. లేదూ ఈ బిల్డప్ అంతా ట్రైలర్స్ కే పరిమితం అనే ఫలితం వస్తే అలవాటైన తతంగమే కాబట్టి మరోసారి వర్మను నమ్మినందుకు ప్రేక్షకులు పెద్ద తేడాగా ఫీలవ్వరు