అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేయాలంటే మనదగ్గర స్టార్లకు, స్టాల్ వార్ట్స్ కు కొదవేముంది? అయినా అక్కినేని నాగార్జున చేతుల మీదుగానే ఆ పని చేయించొచ్చు కదా. అందులోనూ నిన్న ఆయన పుట్టిన రోజు కూడా. కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో టీజర్ లాంచ్ చేయించింది. దీని వెనుక కారణం లేకపోలేదు. ‘అఖిల్’ సినిమాను హిందీలోనూ భారీ ఎత్తున విడుదల చేసే ఆలోచనతోనే సల్మాన్ తో ఫస్ట్ లుక్ ఆవిష్కరింపజేసినట్లు అక్కినేని ఫ్యామిలీ వర్గాల సమాచారం.
అఖిల్ బాలీవుడ్ జనాలకు ఇప్పటికే పరిచయమైపోయాడు. కల్కి కొచ్చర్ తో కలిసి చేసిన ‘టైటాన్’ యాడ్ దేశవ్యాప్తంగా పాపులరైంది. ఏమాత్రం తడబాటు లేకుండా చాలా ఈజ్ తో ఆ యాడ్ చేసి అక్కడి జనాల్ని కూడా మెప్పించాడు అఖిల్. మౌంటైన్ డ్యూ యాడ్ తో మరోసారి హిందీ ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. కాబట్టి అఖిల్ తెలియని ముఖమేం కాదు. ఈజీగా అతడి తొలి సినిమాతో జనాలు కనెక్టయ్యే అవకాశముంది.
ఇప్పటికే బాహుబలి సినిమాతో బాలీవుడ్ జనాలకు తెలుగు సినిమాల మీద మంచి ఇంప్రెషన్ పడింది. పైగా హీరోయిన్ సాయేషా సైగల్ కూడా అక్కడమ్మాయే. ఇది కూడా ఓ అడ్వాంటేజే. కాబట్టి ‘అఖిల్’ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపబోతున్నాడన్నమాట. సినిమాకు మంచి టాక్ వస్తే మున్ముందు అఖిల్ బాలీవుడ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.