మళ్లీ ఆ బాధ నేను పడలేక నో చెప్పా : తాప్సి

Update: 2019-06-23 08:17 GMT
సౌత్‌ లో పలు చిత్రాల్లో నటించినా కూడా సరైన గుర్తింపును దక్కించుకోలేక పోయిన ముద్దుగుమ్మ తాప్సి ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. 'పింక్‌' చిత్రంలో అమితాబచ్చన్‌ తో కలిసి నటించిన తాప్సికి ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌ సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు సౌత్‌ సినిమాలను కూడా చేస్తూ ఉన్న తాప్సికి 'పింక్‌' చిత్రం తమిళ రీమేక్‌ ఆఫర్‌ వచ్చిందట. హిందీలో ఏ పాత్ర అయితే పోషించిందో అదే పాత్రను తమిళంలో కూడా చేయాల్సిందిగా నిర్మాత బోణీ కపూర్‌ ఆమెను కోరడం జరిగిందట. అందుకు తాప్సి సున్నితంగా నో చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా తాప్సి చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ.. పింక్‌ చిత్రం చేస్తున్న సమయంలో చాలా భావోద్వేగానికి గురై ఒకానొక దశలో ఏకంగా డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయాను. సినిమాలో ఎక్కువగా లైంగిక వేదింపులకు సంబంధించిన సీన్స్‌ ఉంటాయి. ఆ సీన్స్‌ చేస్తున్న సమయంలో నేను చాలా బాధ పడ్డాను. ఆ బాధ మరోసారి పడలేకనే 'పింక్‌' చిత్రం రీమేక్‌ లో తాను నటించలేను అంటూ చెప్పినట్లుగా తాప్సి చెప్పుకొచ్చింది. అజిత్‌ గారితో నటించడం నాకు ఇష్టమే కాని.. ఈ చిత్రం కోసం ఆయనతో నటించలేను అని చెప్పాను. మరోసారి అజిత్‌తో నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నటిస్తానంది.

'పింక్‌' చిత్రం తమిళ రీమేక్‌ అయిన నెర్కొండ పార్వై చిత్రంలో తాప్సి పాత్రను కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్‌ చేసింది. అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న నెర్కొండ పార్వై చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించడం జరిగింది. లాయర్‌ పాత్రలో అజిత్‌ కనిపించబోతున్నాడు.
Tags:    

Similar News