ఉపాసన ఎందుకు మిస్సయిందంటే!!

Update: 2016-12-05 07:30 GMT
రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ మధ్య కాలంలో ఏ ఈవెంట్ ని మిస్ కావడం లేదు. చరణ్ ఎక్కడికి వెళితే అక్కడికి తోడుగా వెళ్లిపోతోంది. ఆఖరికి హీరోయిన్ తో సాంగ్ వేసుకోవడానికి థాయ్ ల్యాండ్ వెళితే.. వెనకే వెళ్లిపోయి వాళ్లిద్దరి ఫోటోలు తీసి నెట్ లో పెట్టేస్తోంది. కానీ.. ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం మిస్ అయిపోయింది. ఇంత పెద్ద ఫంక్షన్ లో ఉపాసన కనిపించలేదేంటబ్బా అని మెగా ఫ్యాన్స్ చర్చించుకోవడం కనిపించింది.

ఇంత చిన్న టాపిక్ మీద అంత పెద్ద డిస్కషన్ ఎందుకు అనుకున్న ఉపాసన.. ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించకపోవడానికి కారణం చెప్పేసింది. ఎక్స్ ప్లనేషన్ టైపులో కాకపోయినా.. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా అసలు విషయం చెప్పింది ఉపాసన. 'ఆస్ట్రేలియాలో ఉన్నానండీ! ఇండియా వచ్చేస్తున్నా. మమ్మీతో కలిసి లీడర్ షిప్ డైలాగ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాను. నిన్ను మిస్ అవుతున్నా మిస్టర్ సీ. డిసెంబర్ 9న రానున్న ధృవ కోసం ఆన్ టైంలో వచ్చేస్తాలే' అంటూ ట్వీట్ చేసింది ఉపాసన.

ఇటు ధృవ రిలీజ్ ఒక్కటే కాదులెండి.. మెగాస్టార్ మూవీ ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన పనులు కూడా హ్యాండిల్ చేసేస్తోంది ఉపాసన. అనౌన్స్ చేయలేదు కానీ.. డిసెంబర్ 18న జరగనున్నా ఖైదీ ఆడియో ఫంక్షన్ కి సంబంధించి.. నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి హోల్ అండ్ సోల్ రైట్స్ అన్నీ ఉపాసనవే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News