విశాఖలో కంచె అందుకేనట

Update: 2015-09-12 05:20 GMT
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో గమ్యం ఒకటే తెలుగులో కమర్షియల్ విజయం సాధించింది. అయితే కుర్రాడిలో విషయం వుందని గ్రహించిన అగ్రతారలెవరూ దీన్ని పట్టించుకోకుండా తనతో సినిమాలకు అంగీకరించడం ఆనందదాయకం. ప్రస్తుతం రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న కంచె సినిమా విడుదలకు సన్నద్దమవుతుంది. వచ్చే వారం పాటలను మన ముందుకు తీసుకురానున్నారు. దీనికోసం విశాఖను వేడుకాస్థలంగా ఎంపిక చేసుకున్నారు.

రాష్ట్ర విభజన తరువాత విశాఖలో కూడా తరచూ ఆడియో రిలీజ్ లు జరుగుతున్న సంగతి మనకు తెలిసినదే. అయితే కంచె బృందం మాత్రం ఆ నగరాన్నే ఎంపిక చేసుకోవడం వెనుక ఒక చారిత్రాత్మకమైన కారణం వుందంటున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ యుద్ధ విమానాలు విశాఖపట్టణంపై దాడి చేశాయని, మా సినిమా ఆ నేపధ్యంలోనే సాగుతుంది గనుక ఈ ఈవెంట్ అక్కడ జరపడమే సబబని దర్శకుడు తెలిపాడు. అంతేకాక మనుషుల మధ్య ఏర్పరుచుకున్న కంచెను ఎలా తొలగించుకున్నారు అన్నది చిత్రంలో నిగూడంగా చూపించామని చెప్పుకొచ్చాడు. అదన్నమాట మేటరు.. 
Tags:    

Similar News