'చంద్రముఖి' సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త కొన్ని రోజులుగా కోలీవుడ్లో షికారు చేస్తోంది. ఆ వార్త గాలికి ఆ చెట్టుకూ ఈ పుట్టకు కొట్టుకుని చివరికి టాలీవుడ్ కి చేరుకుంది. దాంతో తమిళనాటనే కాదు .. తెలుగు ప్రేక్షకులలోను ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. ఎందుకంటే 'చంద్రముఖి' సాధించిన విజయం అలాంటిది .. హారర్ కామెడీ జోనర్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది. ఈ సినిమాలో రజనీకాంత్ .. ప్రభు .. నయనతార .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.
దెయ్యం .. ఆవహించడం వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఆ సన్నివేశాలను చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. ఆత్మను తరిమివేయడానికి ఒక వైపు నుంచి డాక్టర్ ... మరో వైపు నుంచి మాంత్రికుడు ప్రయత్నాలు చేసే తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. విద్యాసాగర్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయిగానీ, రజనీ ఆసక్తి చూపని కారణంగా పట్టాలెక్కలేదు.
దాంతో దర్శకుడు పి.వాసు ఈ సినిమా సీక్వెల్ ను లారెన్స్ తో చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. హారర్ కామెడీ సినిమాలు చేయడంలో లారెన్స్ కి మంచి అనుభవం ఉంది. అంతేకాకుండా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివలింగ' హిట్ టాక్ తెచ్చుకుంది. అందువలన 'చంద్రముఖి 2' ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. అయితే ఈ సీక్వెల్ కి సంబంధించిన మాటలు జరిగి చాలాకాలమే అయినా, ఇంకా పట్టాలపైకి బండి చేరుకోకపోవడానికి కారణంగా లారెన్స్ పేరు వినిపిస్తోంది.
'చంద్రముఖి' సీక్వెల్ కి జనంలో ఏ స్థాయి ఆదరణ ఉంటుందనేది లారెన్స్ కి తెలుసు. అలాంటి సినిమాను పూర్తి చేస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు దానిని ఓటీటీకి ఇచ్చేస్తారు. 'చంద్రముఖి' సీక్వెల్ కథ ఏమిటనేది లారెన్స్ కి తెలుసు. అలాంటి కథను .. కొన్ని సందర్భాల్లో వేసే ఎఫెక్టులను థియేటర్లలో చూసినప్పుడే మజా ఉంటుంది. ఓటీటీలో ఈ తరహా సినిమా చూడటం వలన అంతగా కిక్ ఉండదు. పైగా రజనీ స్టైల్ వేరు .. లారెన్స్ రూట్ వేరు అనే విమర్శలు కూడా వస్తాయి.
అందువలన ఈ సినిమా షూటింగు మొదలుపెట్టకుండా లారెన్స్ ఆలస్యం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం అనుష్కను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆమె ఒప్పుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.