చైతూ .. సమంత విడాకులకి ఇవా కారణాలు?

Update: 2021-10-04 03:32 GMT
నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లిచేసుకున్నారు .. కొంతకాలం పాటు ఆనందంగా కలిసి జీవించారు .. ఏదో సమస్య వారి బంధాన్ని విడదీసింది. అంత బలమైన కారణం ఏమై ఉంటుందా అని చాలామంది భూతద్దాలు పట్టుకుని వెతికే పనిలో ఉన్నారు. ఇక మాటకు చివరలో 'అట' అనే పదాన్ని చేర్చేసి ఎవరు రాయవలసింది వాళ్లు రాసేస్తున్నారు. ఎవరి ఇష్టానికి వాళ్లు మాట్లాడేస్తున్నారు. నిజానికి చైతూ - సమంత విడాకులు తీసుకున్నప్పటికీ కొంతకాలం పాటు వాళ్లని ఈ బాధ వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్లని ఇలాంటి ఊహాగానాలు మరింత బాధపెడతాయి.

సమంత .. చైతూ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది 'ఫ్యామిలీ మ్యాన్ -2' వెబ్ సిరీస్ అనే ప్రచారం బయట వీరవిహారం చేస్తోంది. ఆ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ సీన్స్ చేసింది. నిజానికి అలాంటి సీన్స్ చేయడానికి ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తే, ఆ సీన్స్ ను తీసేస్తారు. లేదంటే మరోలా ఆ సీన్స్ ను ప్లాన్ చేసుకుంటారు. కానీ సమంత బోల్డ్ సీన్స్ లో ఎలాంటి మొహమాటం లేకుండా చేసేసింది. ఆమెను అలా చూసిన అక్కినేని అభిమానులు, సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి సన్నివేశాలు చేయడానికి ముందు ఫ్యామిలీ నేపథ్యాన్ని గుర్తుచేసుకోమని ఘాటుగానే చెప్పారు.

అయితే సమంత ధోరణి అందరికంటే చైతూకి బాగా తెలుసు. ఆమె హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వదిలినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ 'ఫ్యామిలీ మ్యాన్ 2' మాత్రం ఆయనను కాస్త ఇబ్బంది పెట్టిందనేది ఎక్కువ మంది చెప్పుకుంటున్న మాట. ఈ విషయమే విడిపోవడానికి కారణమైందని అంటున్నారు. ఇప్పట్లో సినిమాలు మానేది లేదనీ .. ఇప్పట్లో బిడ్డలను కనే ఆలోచన కూడా లేదని సమంత చైతూతో తేల్చి చెప్పడమే గొడవకి కారణమైందని మరి కొందరు చెప్పుకుంటున్నారు. ఇక 'లవ్ స్టోరీ' సినిమా ఫంక్షన్ లో ఆమిర్ ఖాన్ కనిపించడంతో, ఈ సమస్యలోకి ఆయనను కూడా లాగారు.

'లాల్ సింగ్ చద్దా' సినిమా షూటింగు సమయంలో తమ మధ్య పెరిగిన సాన్నిహిత్యం కారణంగా ఆమిర్ ఖాన్ 'లవ్ స్టోరీ' సినిమా ఫంక్షన్ కి వచ్చారు. చైతూ చాలా మంచివాడు అంటూ కితాబునిచ్చారు. అయితే ఆయన అంతకుముందు తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. అందువలన ఆ సినిమా షూటింగు సమయంలో తన మాటలతో చైతూను ప్రభావితం చేసి, ఆయన విడాకులు తీసుకునేలా చేశాడనే రూమర్ ఒక రేంజ్ లో షికారు చేస్తోంది. 'నేను ఫలానా చోట ఓ ఖరీదైన ఫ్లాట్ తీసుకున్నాను .. నువ్వు కూడా తీసుకో' అన్నట్టుగా, ఈ మధ్యనే నేను విడాకులు తీసుకున్నాను నువ్వు కూడా తీసుకో' అని ఎవరైనా చెబుతారా?

అసలు చైతూ .. సమంత విడాకులు తీసుకోవడం వలన ఆమిర్ ఖాన్ కి వచ్చేదేవుంటుంది? ఒరిగేదేవుంటుంది? భార్యాభర్తలు బంధం చాలా బలమైంది .. ఒక కప్పు కింద కలిసి ఉండటం కోసం వాళ్లు అనేక కష్టాలు పడతారు. ఒకవేళ ఏ కారణంగానైనా విడిపోవలసి వస్తే, అందరికంటే ఎక్కువగా బాధపడేది వాళ్లే. ఎంతో బలమైన కారణం లేకపోతే ఎవరూ అలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఆ కారణం ఏదైనా అది వాళ్లిద్దరికీ సంబంధించినది. అందువలన సిల్లీ రీజన్స్ వెదుకుతూ ఎంతకాలం కూర్చున్నా, కాలం వృథా అవుతుందేతప్ప కలిసొచ్చేదేం ఉండదు.         
Tags:    

Similar News