పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రాధేశ్యామ్' ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు మూడున్నరేళ్లుగా ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చాలా రోజులుగా వివిధ కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు పరిస్థితులు అదుపులోకి రావడం.. థియేటర్లలో భారీ చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో 'రాధేశ్యామ్' చిత్రాన్ని మేకర్స్ ఈ శుక్రవారం మార్చి 11న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఇప్పటికే యుఎస్ ప్రిమియర్స్ పడిపోవడంతో టాక్ బయటికి వచ్చేసింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీకి ఇక్కడ కూడా అదే టాక్ వినిపించడం గమనార్హం. విజువల్ వండర్ గా వుందన్న వాళ్లే కానీ సినిమాకు జెన్యూన్ హిట్ టాక్ ని వినిపించిన వారు మాత్రం లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే ఈ చిత్రానకి సంబంధించిన మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తూ వైరల్ గా మారింది.
ఈ చిత్రంలో పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రెబెల్, బిల్లా చిత్రాల తరువాత మరోసారి ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించిన చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీ లో వీరిద్దరి మధ్య వచ్చే సన్ని వేశాలు ఎలా వుంటాయోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారికి ఓవర్సీస్ లో షాక్ తగిలినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణంరాజు పోషించిన పాత్రని తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వెర్షన్ లకు గానూ సత్య రాజ్ చేత చేయించారు.
అది ట్రైలర్ లోనూ మేకర్స్ స్పష్టం చేశారు. అయితే యుఎస్ లో ప్రదర్శిస్తున్న తెలుగు ప్రింట్ లో మాత్రం రెబల్ స్టార్ కృష్ణంరాజు మిస్ అయ్యారట. ఆ స్థానంలో సత్యరాజ్ కనిపించడం అక్కడి వారిని ప్రస్తుతం షాక్ కు గురిచేస్తోందని చెబుతున్నారు.
కృష్ణంరాజు పాత్రని తెలుగులో చూపించాలనుకున్న మేకర్స్ మరో ఆలోచన రావడంతో సత్యరాజ్ చేత అదే పాత్రని చేయించారట. దాన్నే తెలుగు వెర్షన్ కు కూడా వాడేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ ఇలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు ఎవరికీ అంచుచిక్కడం లేదు.
చాలా కాలం తరువాత తనకు తగ్గ పాత్ర కుదరడంతో కృష్ణంరాజు కొన్ని కీలక సీన్‌లతో ప్రభాస్ తో నటించడమే కాకుండా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు కూడా. అయితే యుఎస్ ప్రింట్ లో కృష్ణంరాజు ప్లేస్ లో సత్యరాజ్ ని ఎందుకు చూపించారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే యుకె కు పంపించిన ప్రింట్లలోనూ ఇదే పరిస్థితి పునరావృతం కావడం కృష్ణంరాజు అభిమానులని షాక్ కు గురిచేస్తోంది.