ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే ఆ సీక్వెల్ కోసం జనం ఎదురుచూస్తారో లేదో కానీ ఆ చిత్ర దర్శకుడు, హీరో మాత్రం వెయిట్ చేస్తూంటారు. సక్సెస్ ని కంటిన్యూ చేయాలని ఆశపడుతూంటారు. అలాంటిదే నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా. కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా ఐదేళ్ల క్రితం మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. దాంతో ఆ క్యారక్టర్ ఆదారంగా మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్, నాగార్జున భావించారు.
ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ రకరకాల కారణాలతో కారణాలవల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇదిగో స్టార్ట్ అవుతుంది అదిగో వచ్చే నెల నుంచే అన్నారు కానీ మొదలైంది లేదు...మాటలే మిగిలాయి. అయితే మీడియా వాళ్లు నాగ్ ని కలిసినప్పుడల్లా అదే టాపిక్ ఎత్తుతూ వస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత నాగచైతన్య తో ‘రారండోయ్ వేడుక చూదాం’ రవితేజతో ‘నేల టికెట్’ సినిమా చేసాడు కళ్యాణ్.
చైతుతో చేసిన సినిమా యావరేజ్ అయితే రెండోది రవితేజతో చేసింది డిజాస్టర్ అయ్యింది. దాంతో మరీ వెనకబడ్డాడు ఆ డైరక్టర్. అప్పటిదాకా ఆ డైరక్టర్ వెనకబడ్డ ఇండస్ట్రీ...మర్చిపోయింది. మళ్లీ పామ్ లోకి రావాలంటే ఆ డైరక్టర్ కు ‘బంగార్రాజు’ అవసరం ఉంది. దాంతో ఆ ప్రాజెక్టును ఎలాగైన పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే నాగ్ ముందుకు వెళ్లనివ్వటం లేదు. వైల్డ్ డాగ్ తో సహా రకరకాల ప్రాజెక్టులు చేస్తున్నాడు కానీ నాగ్ కు ఏదీ కలిసి రావటం లేదు.
తాజాగా మరోసారి ‘బంగార్రాజు’ సినిమాకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట నాగ్. కరోనా గ్యాప్ లో ఈ సినిమాకు సంభందించిన పనులే చేస్తున్నాడట. ఈ విషయం నాగ్ స్వయంగా చెప్పారు. నాగ్ మాట్లాడుతూ...కొత్త కథలంటే... ‘బంగార్రాజు’ కథనే సిద్ధం చేసుకుంటున్నాం. దర్శకుడు కల్యాణ్కృష్ణతో కలిసి ఆన్లైన్లో మాట్లాడుతూ కథ గురించి చర్చించుకుంటున్నాం. షూటింగ్ లు మొదలు కాగానే, ఆ సినిమాని మొదలు పెట్టాలి అన్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసాడట దర్శకుడు కళ్యాణ్. ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణలతో పాటు నాగచైతన్య మరో పాత్రలో నటించనున్నాడని వినిపిస్తున్నాయి.