తిరుపతిలో ఇవేం సినిమాలండీ బాబూ

Update: 2016-09-23 17:30 GMT
ఇప్పుడు మీరు సడన్ గా హైదరాబాద్ వానలను లెక్క చేయకుండా ఏదన్నా ఫ్లయిట్ పట్టుకుని ఉన్నపలంగా శ్రీవేంకటేశ్వరుని ఆస్థాన నగరం తిరుపతిలో వాలిపోండి. వెంటనే మీకు ఆహ్లాదకరమైన స్పిరుచ్యుల్ వాతావరణం దర్శనమిస్తుంది. అయితే తిరుపతిలో ప్రతీ చోటనా ఆ శ్రీనివాసుడి సుందర చిత్రాలు - భక్తిపారవశ్యం నింపడానికి ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగులే కావు.. కామన్ గా ఉండే ఎడ్వర్టయిజింగ్ బిల్ బోర్డులు కూడా కనిపిస్తాయి.

దానికితోడు తిరుపతి నగరంలో సామాన్య మానవులు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి.. అక్కడున్న సినిమా ధియేటర్లలో ఆడే సినిమాల పోస్టర్లు కూడా కనిపిస్తాయిలే. అయితే ఇప్పుడు ఎయిర్ పోర్టు - రైల్వే స్టేషన్ - బస్ స్టాండ్ వంటి ప్రధాన కూడళ్లలో.. అక్కడి నుండి అలిపిరి-తిరుమలకు వెళ్ళాక రోడ్లలో 'రెడ్' అనే ఒక సినిమా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అటు పక్కనే 'జనతా గ్యారేజ్' ఇటు 'జ్యో అచ్చుతానంద' మధ్యలో ఈ 'రెడ్' పోస్టర్లు ఏంటా అని ఎవరైనా తీక్షణంగా గమినిస్తే.. అదొక బూతు సినిమా అని అర్ధమైపోతోంది. ఏదో మామూలు సినిమాలంటే ఓకె కాని.. అసలు తిరుపతిలో అది కూడా శ్రీనివాసుడు సతీమణుల పేరుతో ఉన్న ధియేటర్లలో ఇలాంటి సినిమాలను ప్రదర్శిస్తారా?

కారు అద్దాల్లోనుండి.. క్యాబ్ సందుల నుండి ఈ పోస్టర్ల గమనించిన వారందరూ ఇవేం పోస్టర్లండీ బాబూ అంటూ తిట్టుకోవడం మినహా ఇంకేం చేయగలరు. ఒకవేళ ఎవరైనా అధికారులు చర్యలు తీసుకుంటే మాత్రం అందరూ ఆనందిస్తారు.
Tags:    

Similar News