ఇంకో ముప్పై గంటల్లో బాక్స్ ఆఫీస్ మీదకు దాడి చేయబోతున్న యంగ్ టైగర్ అరవింద సమేత వీర రాఘవ గురించిన టెన్షన్ అభిమానుల్లో అంతకంతా పెరుగుతోంది. ఒకపక్క ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సినిమాకు సంబందించిన విశేషాలతో ఇంటర్వ్యూలలో తెగ ఊరిస్తుండగా మరోపక్క వీడియో ప్రోమోల రూపంలో పాటలని విడుదల చేస్తున్న టీమ్ హైప్ ని పెట్రోల్ ధరలాగా పెంచుకుంటూ పోతోంది. ఆడియో మొత్తానికే కాదు సినిమాలోనే మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా అంచనాలు ఉన్న రెడ్డి ఇక్కడ చూడు వీడియో సాంగ్ ని ఇందాకా విడుదల చేసారు.
తారక్ ఎప్పటి లాగే కాస్ట్యూమ్స్ తో పాటు స్టెప్స్ తో అదరగొట్టగా సన్నని జలతారులాంటి నడుముతో వయ్యారంగా స్టెప్పులేతున్న పూజా హెగ్డే అందాలు ఆమ్మో అనిపిస్తున్నాయి. మొత్తానికి రెడ్డి ఇక్కడ చూడు పాటకు థియేటర్లు ఈలలు గోలలతో రచ్చ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెడ్డి ఇక్కడ సూడు ఇటీవలే జానీ మాస్టర్ డాన్స్ నేతృత్వంలో ఖరీదైన సెట్స్ మధ్య చిత్రీకరించారు. సెకండ్ హాఫ్ లో ఈ పాట వస్తుందని టాక్. రిచ్ క్లాస్ విజువల్స్ తో అంతకు మించి తారక్ పూజా జోడిల హంగామాతో ఈ పాట కన్నుల పండుగగా ఉంది. దీంతో ఒక్క పాట మినహాయించి మూడు వీడియో ప్రోమోలు వచ్చేసినట్టే. బాలన్స్ అంచనాలు ఏమైనా ఉంటే అవి దీంతో పూర్తిగా భర్తీ అయిపోయాయి.
ఎప్పుడెప్పుడు గురువారం తెల్లవారుఝాము వస్తుందా అని జూనియర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అసలే ఏడాదికి పైగా గ్యాప్. దానికి తోడు చాలా కాలం తర్వాత సీమబిడ్డ వీర రాఘవ రెడ్డిగా తారక్ విశ్వరూపం చూడబోతున్నారు. ఆ మాత్రం ఉత్సుకత ఉండటం సహజం. ఇప్పుడు రెడ్డి ఇటు సూడు చూసాక మనసు ఆగుతుందా.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View