టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రాకు ఇప్పుడు పెద్దగా టైం బాలేదనే చెప్పాలి. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన కృష్ణ వంశీ మూవీ నక్షత్రం.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే.. ట్యాలెంట్ తో పైకి ఎదిగిన ఈ బ్యూటీ.. తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం తప్పకుండా వస్తుందని.. మళ్లీ తాను క్రేజ్ సంపాదించుకోలుగుతానని నమ్మకంగా ఉంది.
ఈ మధ్యలోనే రెజీనాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ఆమె ఎవరితోనో రిలేషన్ షిప్ లో ఉందనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కొంతకాలం పాటు వీటిపై మిన్నకున్న ఈ సుందరి.. ఇప్పుడు పెదవి విప్పేసింది. "జీవితంలో ప్రతీ అంశానికి ఓ దశ ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్ లో నేను నేర్చుకున్న విషయం అదే. ఏ విషయానికి నేను త్వరపడడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎందుకు సింగిల్ గా ఉండిపోయాను అనే ఆలోచన ఇప్పటివరకూ రాలేదు. వర్తమానంలో జీవించాలని నా అనుభవం నాకు నేర్పింది" అంటోంది రెజీనా కసాండ్రా.
"ఎవరి పైనా ఆధారపడకుండా జీవించడం నేను నేర్చుకున్నాను. ఈ సమయంలో ఎలాంటి రిలేషన్ షిప్ లోను ఇమిడే ఉద్దేశ్యం నాకు ఏ కోశానా లేదని స్పష్టంగానే చెబుతాను. నన్ను నేను మొదట అర్ధం చేసుకోవాలి. ఆ తర్వాతే వేరే వ్యక్తి గురించి ఆలోచించాలి. గతంలో నేను రిలేషన్ షిప్ లో ఉండడమే.. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం కావచ్చు. మరో రెండేళ్ల పాటు నేను సింగిల్ గానే ఉండదలచాను" అంటున్న రెజీనా.. గతంలో ఎవరితో రిలేషన్ షిప్ నడిపిందనే విషయం మాత్రం చెప్పలేదు.