పళ్లు పీకుతూ ప్రేమిస్తున్న రెజీనా

Update: 2016-03-18 05:24 GMT
డెంటిస్ట్ అంటే పళ్లు పీకేసే డాక్టర్ అని మన జనాల్లో మాంచి ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఆ పాత్రలోనే నటిస్తోంది యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఈ భామ 'ఊహలు గుసగుసలాడే' చిత్రంలోనే నటించాల్సి ఉంది. అయితే.. అప్పట్లో డేట్స్ కుదరకపోవడంతో చేయలేకపోయింది రెజీనా. ఇప్పుడు నారా రోహిత్ - నాగశౌర్యలు హీరోలుగా అదే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న మూవీ 'జ్యో అచ్యుతానంద'లో మాత్రం ఆఫర్ దక్కించుకుంది.

'ఈ సినిమాలో నేను డెంటిస్ట్ రోల్ లో కనిపిస్తాను. రియల్ లైఫ్ ఈ తరం అమ్మాయిలు ఎలా ఉంటారో.. నా కేరక్టర్ కూడా అలాగే ఉంటుంది. అమ్మాయి- అబ్బాయి మధ్య ఓ అందమైన రిలేషన్ ని చూపించబోతున్నారు. ఓ పద్ధతైన కుటుంబ నుంచి వచ్చిన ఈ కేరక్టర్ కి.. ఇద్దరు సోదరులతో స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. అదే జ్యో అచ్యుతానంద కాన్సెప్ట్' అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.

అనుబంధాల్లో కొన్నిసార్లు పరిస్థితులను చాలా తెలివిగా హ్యాండిల్ చేయాల్సి వస్తుందని.. అదే జ్యో అచ్యుతానంద ద్వారా చూపించబోతున్నారని రెజీనా అంటోంది. అంతా బాగానే ఉంది కానీ.. నారా రోహిత్ - నాగశౌర్యల్లో.. రెజీనా ప్రేమించబోయేది ఎవరినో.. అన్నయ్యా అనేదెవరినో మాత్రం అర్ధం కాలేదు. ఇంతకు పళ్ల డాక్టర్ ని ప్రేమించేది ఎవరో?
Tags:    

Similar News