అందాల భామలు రెజీనా కాసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ''శాకినీ ఢాకినీ''. 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో రెజీనా - నివేదా జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా అడల్ట్ జోక్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. రెజీనా - నివేదా థామస్ ఇద్దరూ హోస్ట్ తో కలిసి లంచ్ చేస్తుండగా.. ''అబ్బాయిల మీద నా దగ్గర పెద్ద జోక్ ఉంది. కానీ నేను ఇక్కడ అది చెప్పకూడదు'' అని రెజీనా అంటుంది. ఈ సందర్భంగా 'అందరు అబ్బాయిల గురించి వద్దులే.. నా మీద చెప్పండి' అని హోస్ట్ అంటాడు.
దీంతో రెజీనా మాట్లాడుతూ.. ''అబ్బాయిలు - మ్యాగీ రెండూ ఒకటే. ఎందుకంటే రెండూ 2 నిమిషాల్లో అయిపోతాయి'' అని పేర్కొంది. దీన్ని అర్థం చేసుకోవడానికి హోస్ట్ కి కొంత సమయం పట్టింది. అయితే రెజీనా వెంటనే 'నేను చెప్పిన జోక్ నీకు అర్థం కాలేదు' అని చెప్పిన తర్వాతే.. అది ఎలాంటి జోక్ అనేది అతనికి అర్థమైంది.
ఈ సందర్భంలో పక్కనే ఉన్న నివేదా థామస్ నవ్వుతూ తింటూ కనిపించింది. కానీ రెజీనా జోక్ చెప్పిన తర్వాత కూడా ఆమె ఎక్స్ ప్రెషన్ మారలేదంటే.. అడల్ట్ జోక్ నివేదాకి అర్థం కాలేదనే అనిపిస్తోంది. రెజీనా ఇలాంటి జోక్ చెప్పడం వెనుక ఉన్న సందర్భం ఏంటనేది తెలియలేదు.
అయితే ఇది నిజంగా ఇంటర్వ్యూలో భాగమా లేదా ఉద్దేశపూర్వకంగా లీక్ చేయబడిన ఆఫ్ లైన్ ఫుటేజీనా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఏదైతేనేం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే 'శాకినీ డాకినీ' సినిమాలో రెజినా ఓసీడీతో ఇబ్బంది పడే పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో 'మీకు కూడా ఓసీడీ వుందా?’ అని ఓ జర్నలిస్టు చాలా సాధారణమైన రీతిలో రెజినాని ప్రశ్నించారు. అయితే దీనిపై ఆమె ఫైర్ అయింది.
‘ఓసీడీ అనేది ఒక డిజార్డర్ అనీ.. ఈ ప్రశ్న ఓ హీరోని అడగ్గలరా?’ అంటూ రిపోర్టర్ పై అసహనం వ్యక్తం చేసింది. కూల్ గా సమాధానం చెప్పాల్సిన విషయంపై రెజినా ఇంతలా ఎందుకు ఓవర్ రియాక్ట్ అయినట్లు అని అందరూ ఆలోచించారు. వివాదాల ద్వారా సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఇది భాగమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇదే ప్రెస్ మీట్ లో సినీ జర్నలిస్టుల ఫోన్లు రింగ్ అవడం పట్ల కూడా రెజినా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే 'శాకినీ డాకినీ' సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ - క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై దగ్గుబాటి సురేష్ బాబు - సునీత తాటి - హ్యూన్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రెజీనా - నివేదా లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.