చీరందంలో రెజీనా..రెండు క‌ళ్లు చాల‌వేమో!

Update: 2022-07-27 15:08 GMT
``తెల్ల‌చీర‌..ఎర్ర‌బొట్టు..క‌ళ్ల‌ కాటుక‌.. పెట్టుకుని వ‌చ్చింది కృష్ణమ్మా. ఏదో క‌బురు ప‌ట్టుకొచ్చింది కృష్ణ‌మా? ఆక‌బురేమిట‌మ్మా? ఈ ప‌రుగెందుకమ్మా? అంటూ  అప్ప‌ట్లో అన్న‌గారు ఎన్టీఆర్ అందుకున్న ప‌ల్ల‌విని మ‌ళ్లీ అందుకోవాలేమో! ఆ పాట‌లో శ్రీదేవి అందాన్ని వ‌ర్ణిస్తూ అన్న‌గారు  పాడుతుంటారు. ఇప్పుడీ ఫోజులో రెజీనా క‌సాండ్రా అందాన్ని వ‌ర్ణిస్తూ మ‌న‌మందుకోవాలేమో.

అవును స‌రిగ్గా  అదే పాట‌ని గుర్తు చేసింది రెజీనా క‌సాండ్రా. తెల్ల‌చీర క‌ట్టింది...ప‌సుపు ర‌విక ధ‌రించింది. క‌ళ్ల‌కి కాటుక లేదు. త‌ల‌లో మ‌ల్లెపూలు లేవు గానీ బ్యూటీ అందానికి మాత్రం మైమ‌ర‌వాల్సిందే. సంప్ర‌దాయ  చీర క‌ట్టులో రెజీనా అంత అందంగా క‌నిపిస్తుంది. వైట్ సారీపై త్రిశూలంతో కూడిన ఎంబ్రాయిడ‌రీ డిజైన్ అంతే హైలైట్ అవుతుంది.

చీరందంలో ఎంతో సంప్ర‌దాయంగా కనిస్తుంది. పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వు... గుండ్ర‌ని క‌ళ్లు..ముఖ సౌంద‌ర్యంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇలా చీరందంలో రెజీనాని  చూసి చాలా కాల‌మ‌వుతుంది. క‌నుల‌కు విందుగా ఉంది.  ప్ర‌స్తుతం ఈఫోటో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారియింది. బ్యూటీ సారీ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఇక రెజీనా కెరీర్ సంగ‌తి చూస్తే ఇంకా  ద్వితీయ శ్రేణి నాయికగానే కొన‌సాగుతోంది. అయితే గ‌తంతో పొల్చుకుంటే న‌టీగా బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం  తెలుగు...త‌మిళ్ లో క‌లిపి ఆరు సినిమాలు చేస్తుంది. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంత‌రం ప‌నుల్లో  ఉన్నాయి. మ‌రికొన్ని షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ‌గా కోలీవుడ్ సినిమాలే ఉన్నాయి.

ఇటీవ‌లే `ఆచార్య` సినిమాలో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఫ‌లితం మ‌రోసారి రెజీనా బ్యాట్ టైమ్ నే గుర్తు చేసింది. ఇందులో న‌టించ‌డానికి చిరంజీవి కార‌ణం. పెద్దాయ‌న సినిమా కావ‌డంతో ఆయ‌న మాట కాద‌న‌లేక న‌టించింది. ఈ విష‌యాన్ని రెజీనా ఓపెన్ గానే చెప్పింది.
Tags:    

Similar News