మెగాస్టార్ మూవీపై రెజీనా ఎగ్జైట్మెంట్

Update: 2017-02-03 07:21 GMT
టాలీవుడ్ బ్యూటీ రెజీనా చేతిలో.. ప్రస్తుతం తెలుగు సినిమా ఒక్కటే ఉంది. నక్షత్రం అంటూ కృష్ణవంశీ డైరెక్షన్ లో సందీప్ కిషన్ కి జోడీగా నటిస్తోంది. మరోవైపు తమిళంలో మాత్రం దాదాపు అర డజన్ ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉండగా.. హిందీలో కూడా అరంగేట్రం చేసేస్తోంది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆంఖే2 చిత్రంలో నటించనుంది రెజీనా. ఇప్పటికే తెలుగు.. తమిళ్.. కన్నడ భాషల్లో నటించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో అడుగు పెడుతున్నంత మాత్రన.. ఇదేమీ తనకు రీలాంఛ్ కాదని అంటోంది. తన కెరీర్ లో ఇదో కొత్త అడుగు అని చెప్పిన రెజీనా కసాండ్రా.. 'అమితాబ్ గారితో కలిసి పని చేయడానికి టెన్షన్ ఫీల్ అవ్వడం లేదు. ఆయనతో కలిసి పని చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నా. సీనియర్ల యాక్టింగ్ నేరుగా చూసే అవకాశం దక్కితే.. ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు అమితాబ్ సార్ తో కలిసి పని చేయడంపై ఎగ్జైటింగ్ గా ఉన్నా' అని చెప్పింది రెజీనా.

ప్రస్తుతం లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా ర్యాంప్ పై సందడి చేసిన ఈ బ్యూటీ.. 'సౌత్ సినిమాలకు.. బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. అక్కడ నేను యాక్టింగ్ ప్రారంభించి చాలా నేర్చుకోగా.. ఇప్పటికే గుర్తింపు పొందిన యాక్ట్రెస్ గా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాను. అయినా సరే.. ఇది పెద్ద ప్రపంచంలా కనిపిస్తోంది' అని చెప్పింది రెజీనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News