హీరోయిన్ అంటే అందంగా మాత్రమే కనిపించాలనే కండిషన్ ని ఎప్పుడో పక్కన పెట్టేసింది తెలుగు చిత్ర పరిశ్రమ. నవతరం దర్శకులు కథకి తగ్గట్టుగానే తెరపై హీరోహీరోయిన్లని చూపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల పాత్రల్ని డీ గ్లామరైజ్ కూడా చేసేస్తున్నారు. అందుకు హీరోయిన్లు కూడా అస్సలు అడ్డు చెప్పడం లేదు. నటన విషయంలో తమ టాలెంట్‌ని బయటికి చూపించాలంటే డీ గ్లామరైజ్డ్ పాత్రలే మార్గమని వాళ్లు గట్టిగా నమ్ముతుంటారు. ఇటీవల కథానాయికలు దెయ్యం వేషాలపై మక్కువ చూపిస్తుండటానికి కారణం కూడా అదే. ఇన్నాళ్లూ గ్లామర్ తోనే ఆకట్టుకొన్న రెజీనా కూడా దెయ్యంగా మారిపోయిందిప్పుడు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆమె ఓ చిత్రం చేస్తోంది.
తెలుగు - తమిళంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రెజీనా దెయ్యంగా దర్శనమివ్వనుందట. ఇక ఆమెని తెరపై చూశాక కుర్రాళ్లు `అందాల రాక్షసివే...గుండెల్లో గుచ్చావే` అని పాడుకొంటారో ఏమో! ఈ సినిమాపై రెజీనా చాలా నమ్మకంగా ఉంది. మొదట్నుంచీ నటనకు ప్రాధాన్యమున్న కథలంటే చాలా ఇష్టంతో చేస్తుంటుంది. అయితే రెజీనాకి గ్లామర్ పాత్రలు నప్పవేమో అనే సంకేతం వెళ్లకూడదనే భావనతో మధ్యలో ఆమె గ్లామర్ కి కూడా పచ్చజెండా ఊపేసింది. కొంత కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ నటనపై కాన్సంట్రేట్ చేసింది.