ఇదివరకు లిప్పు కిస్సు అనగానే అమ్మో మా వల్ల కాదు.. మాకు కొన్ని పరిమితులున్నాయి అంటూ వెనకడుగు వేసేవాళ్లు కథానాయికలు. కానీ ఇప్పడు ట్రెండ్ మారింది. కిస్సు అనగానే ఓ యస్ అనేస్తున్నారు. సినిమాకోసమే కదా... పెదాలు కలిపితే ఏమవుద్ది అంటూ మొహమాటం లేకుండా ముందుకొచ్చేస్తున్నారు. ఇంకా దర్శకనిర్మాతలే... ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడతార్లే అంటూ పెద్దగా లిప్పు కిస్సుల జోలికి వెళ్లరు. కానీ రెజీనా - రకుల్ లాంటి అమ్మాయిలు మాత్రం అప్పుడప్పుడు లిప్పు కిస్సులతో థియేటర్లను వేడెక్కిస్తుంటారు. రకుల్ తక్కువే కానీ... రెజీనా ఇప్పటికే రెండు మూడుసార్లు ముద్దులతో అదరగొట్టింది. రొటీన్ లవ్ స్టోరీ - రారా కృష్ణయ్య - పిల్లా నువ్వు లేని జీవితం తదితర సినిమాల్లో మొహమాటం లేకుండా తన పెదాల్ని హీరోలకి అప్పగించేసింది. ఆ ముద్దులన్నీ కుర్రకారుకి భలే ఇదిగా నచ్చాయి. అందుకే మున్ముందు కూడా మరిన్ని ముద్దు ముచ్చట్లతో అదరగొడతానంటోంది రెజీనా.
`ఎవరికి తెలుసు... ముద్దులతో నేను ట్రెండ్ సృష్టిస్తానేమో, రికార్డులు కొడతానేమో` అని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది రెజీనా. ఇలాంటి స్టేట్ మెంట్లు చూశాక ఇక మన దర్శకులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? రెజీనాని తమ సినిమాల్లో ఎంపిక చేసుకొంటారు, ఘాటెక్కించేలా ఓ ముద్దు సన్నివేశం చేయిస్తారు. అయితే రెజీనా మాత్రం తెరపై ముద్దు సన్నివేశాలంటే ఏదో పనిగట్టుకొని చేసినట్టు ఉండకూడదంటోంది. వాటికి ఓ పర్పస్ ఉండాలి, అలాంటి సన్నివేశాల్లో నటించానికి నాకేమాత్రం ఇబ్బంది లేదంటోంది. అయితే ముద్దు సన్నివేశాలతో నాకు గుర్తింపు రావడం మాత్రం భలే కిక్కిస్తోందని చెబుతోంది. ఆ విషయంలో భవిష్యత్తులో నేనొక కొత్త ట్రెండ్ ని సృష్టిస్తానేమో అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రెచ్చిపో రెజీనా అని చెప్పేద్దామా మరి!!