రెజీనా బాధలు ఇంకా తీరలే!!

Update: 2017-06-12 15:12 GMT
అందాల భామ రెజీనా కసాండ్రాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అందం.. అభినయం.. ప్రతిభ.. తెగువ.. అన్నీ ఉన్నా పెద్ద హీరోయిన్ అనిపించుకునే స్థాయికి చేరుకోవడంలో రెజీనా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. అంతే కాదు... కొత్త అవకాశాలను దక్కించుకోవడంలో కూడా విఫలమవుతూనే వస్తోంది.

తెలుగులో ఇప్పటికే ఈమెకు అవకాశాలు అడుగంటిపోగా.. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం చిత్రంలోనే కనిపించనుంది రెజీనా. ఇలాంటి సమయంలోనే తమిళంలో గట్టి ప్రయత్నాలనే కొనసాగిస్తోంది. అయితే.. ఇప్పటివరకూ ఆశించిన స్థాయి బ్రేక్ మాత్రం రెజీనాకు రాలేదు. మంచి నటి అన్న పేరు తప్ప మరింకేమీ మిగలడం లేదు. ప్రస్తుతం తమిళ్ లో తన కొత్త సినిమా  నేంజం మరపతిళ్లై  విషయంలో కూడా రెజీనాకు కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే ఈ విడుదల కావాల్సి ఉండగా.. ఈ ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు.

ఇప్పుడు జూన్ 23కు విడుదల కావాల్సిన నేంజం మరపతిళ్లై ను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చేతిలో మూడు నాలుగు తమిళ్ సినిమాలు ఉన్నా.. గౌతమ్ మీనన్ నిర్మాతగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై రెజీనా చాలానే ఆశలు పెట్టుకుంది. అందుకే.. ఈ చిత్రం విడుదల కావడం రెజీనాను డిజప్పాయింట్ చేసేస్తోంది. మరోవైపు.. తెలుగులో రెజీనా నటించిన కొత్త చిత్రం నక్షత్రం కూడా ఇలాగే విడుల వాయిదా పడుతూనే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News