ఇంత సరదా అవసరమా రెజీనా

Update: 2016-12-14 07:30 GMT
చేతిలో ఆఫర్స్ లేనప్పుడు.. జనాలు బొత్తిగా మర్చిపోయారన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నలుగురి కంట్లో పడటానికి పబ్లిసిటీ కోసం ఏదో ఒక స్టేటిమెంటో.. సెన్సేషన్ కోసం పిచ్చి పనులు చేయడం.. వాటి మీద రచ్చ జరిగాక అబ్బే నేను ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ కోసం చేశా. ఇలా అవుతుందనుకోలేదు అంటూ బిల్డప్స్ ఇవ్వడం హీరోయిన్స్ కి మా చెడ్డ సరదా. ఇప్పుడు రెజీనా కూడా ఇలాంటి డైలాగ్సే వేస్తోంది.

మొన్నామధ్య ఉంగరాలు మార్చుకొన్న చేతుల్ని పోస్ట్ చేసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా.. పాపం నన్ను చేసుకోబోయే వాడంటూ కలరింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇంకేముంది అందరూ రెజీనాకి పెళ్లి ఫిక్సైపోయిందనుకొన్నారు. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతో ఈ అనుమానాలు ఇంకా బలపడ్డాయ్. కానీ రెజీనా మాత్రం అదోదే సరదాకి చేశా. ఫ్యాన్స్ కి షాకిద్దామని అలా పెట్టానే తప్ప పెళ్లి.. గిళ్లి లేదని తేల్చేసింది. అయితే ఎప్పుడూ చేసుకొన్నా లవ్ మ్యారేజే చేసుకుంటుందట.

ఇక తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో మళ్లీ కోలీవుడ్ చెక్కేసిన రెజీనా నెంజం మరప్పదిల్లై - మానగరం - శరవణన్ ఇరుక్క భయమేన్ - జెమినీ గణేష్ సురుళీరాజనుమ్ - మడై తిరందు అంటూ అరడజన్ మూవీస్ లో కనిపించనుంది. ఎక్కడ సినిమాలు చేస్తే అక్కడ తీన్ మార్ వేయడం మన హీరోయిన్స్ కి అలవాటేగా.. అందుకే ఇప్పుడు మళ్లీ తమిళ భజన చేస్తోంది. తెలుగు ఆడియెన్స్ సినిమాని అప్పటికప్పుడు మాత్రమే ఎంజాయ్ చేస్తారు.. అదే తమిళ్ వాళ్లైతే కేరెక్టర్ ని గుర్తు పెట్టుకోని ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలకరిస్తుంటారు సొంత భాషలో చేస్తే ఆ కిక్కే వేరంటూ సోప్ వేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News