మెగా హీరోతో డేటింగ్‌ చేయట్లేదు

Update: 2015-12-18 07:30 GMT
టాలీవుడ్‌ లోకి స‌ర్రున దూసుకొచ్చింది చెన్న‌య్ భామ రెజీన‌. ఇక్క‌డికి వ‌స్తూనే మెగా క్యాంప్‌ లో పాగా వేసింది. వ‌రుస‌గా మెగా హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఆడిపాడుతోంది. అల్లు శిరీష్‌ - సాయిధ‌ర‌మ్ తేజ్ ఇద్ద‌రికీ రెజీన ఓ ఆప్ష‌న్‌. అయితే మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న బ్యాక్ టు బ్యాక్ ఒక‌దాని వెంట ఒక‌టిగా రెండు సినిమాల్లో న‌టించేసింది. పైగా ఇద్ద‌రిమ‌ధ్యా ఆన్‌ స్ర్కీన్ కెమిస్ర్టీ ఓ రేంజులో వ‌ర్క‌వుటైంది.  దాంతో జ‌నాల్లో గుస‌గుస‌లు కూడా మొద‌ల‌య్యాయి. ఈ ఇద్ద‌రిమ‌ధ్యా ఏదో ఉంది. అది రిలేష‌న్ షిప్ .. డేటింగ్ అంటూ మీడియాలో ప్ర‌చారం సాగింది. సాయిధ‌ర‌మ్‌ తో  రెజీన ఎఫైర్ అంటూ అన్ని టీవీ చానెళ్ల‌లో ప్ర‌చార‌మైంది. అయితే ఇది నిజ‌మేనా? అని రెజీనాని ప్ర‌శ్నిస్తే షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది.

సాయిధ‌రమ్ తో ఎఫైర్ అంటూ సాగించిన ప్ర‌చారం వ‌ల్ల ఒక్క‌సారిగా సెల‌బ్రిటీ అయిపోయాను. కెరీర్ ప్రారంభించి ఇన్నేళ్లు అయినా ఎప్పుడూ నాపై లింక‌ప్ వార్త‌లు రాలేదు. దాంతో నేను ఎంతో డిస‌ప్పాయింట్ అయ్యాను. ఇప్పుడు చెన్న‌య్‌ లో నా ఫ్రెండ్సు అంతా నా ఎఫైర్ గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా ఎంజాయ‌బుల్‌ గా ఉంది.. అంటూ షాకింగ్ ట్రీట్ ఇచ్చింది. అంతేనా సాయిధ‌ర‌మ్‌ తో వీలున్న‌ప్పుడ‌ల్లా శికారుకి వెళుతుంటాను. మేం గుడ్ ఫ్రెండ్స్ మాత్ర‌మే... అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. సందీప్ కిష‌న్‌ - ర‌కూల్ ఫ్రీత్‌ లతో పాటు సాయిధ‌ర‌మ్ నాకు స్పెష‌ల్ ఫ్రెండ్ అంటూ క్లూ ఇచ్చింది.  మేం క‌లిసే శికారు కెళ‌తాం .. కానీ.... ! అంటూ సాగ‌దీసింది. ఇక మీరే అర్థం చేసుకోండి గురూ.. అన్న‌ట్టే ఉంది ఈ య‌వ్వారం. అదీ మ్యాట‌రు.
Tags:    

Similar News