ఫిల్మ్ మీడియా-సెలబ్రిటీల మధ్య ఉన్న అనినాభావ సంబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. మిగతా మీడియాలకు భిన్నంగా ఫిల్మ్ మీడియా కనిపిస్తుంది. ఫిల్మ్ మీడియా వాతావరణమంతా దాదాపు స్నేహపూర్వకంగా సాగుతుంది. చాలా అరుదుగానే కాంట్రవర్శీలు నడుస్తుంటాయి. అవి వ్యక్తిగతమైనా..వ్యవస్థలకు సంబంధించినవైనా ఆరోగ్యకర వాతావరణంలోనే కనిపిస్తాయి.
కొన్ని దశాబ్ధాలుగా సెలబ్రిటీలతో ఫిల్మ్ మీడియా అనుబంధం కొనసాగుతుంది. ఇలా ఎన్నో రకాల కారణాలు సెలబ్రిటీల విషయంలో వివాదాలకు తావు లేకుండా చేస్తుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ మీడియా ముందే కాళ్లు చాపుకుని కాస్త అతి చేసినట్లు కనిపించింది. అది ఇండస్ట్రీ సహా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
లైగర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ రూపంలో ఆ సన్నివేశానికి ప్రతిస్పందనైతే చూసాడు. మీడియా ముందే కాళ్లు టేబులు మీద పెట్టి మాట్లాడుతాడా? అంటూ కొందరు చెవులు కొరుక్కున్నా అది అక్కడితే ఆగిపోయింది. వివాదంలా మారలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు జరిగిన 'శాకిని డాకిని' ప్రెస్ మీట్ లో రెజీనా సైతం మీడియాపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది.
ఈ సినిమాలో రెజీనా ఓసీడీ పాత్రలో నటిస్తుంది. దీంతో పాత్రికేయుడు అదే సినిమా సమావేశంలో మీకు కూడా ఓసీడీ ఉందా? అని సరదగా అడిగాడు. దీంతో రెజీనా అసహనానికి గురైంది. మీ దగ్గర ఇంతకు మించి ప్రశ్నలు లేవా? అని రిపోర్టర్ ముఖం మీదనే అడిగేసింది. ఓసీడీ అనేది వ్యాధి. ఇదే ప్రశ్న ఓ హీరోని అడగగలరా? అంటూ ప్రశ్నించింది.
నిజానికి అలా క్వశ్చన్ చేయడం అన్నది చాలా క్యాజువల్ గా జరిగిందన్నది ఆ రిప్టోర్ట్ ఉద్దేశం. సినిమాలో పాత్రని బేస్ చేసుకుని రియల్ లైఫ్ లో కూడా అంతటి శుభ్రతని పాటిస్తుందా? అన్న కోణంలో ఆ ప్రశ్న వేసాడతను. కానీ రెజీనా సీరియస్ అయినట్లు కనిపించింది. నిజానికి అక్కడంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదన్నదితోటి పాత్రికేయుల ఉద్దేశం.
రెజీనా చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొనసాగుతోంది. ఎన్నో సినిమాలు చేసింది. మరెన్నో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఏనాడు ఇలా స్పందించింది లేదు. ఎలాంటి ప్రశ్నకైనా నవ్వుతూ బధులిచ్చేది. కానీ శాకిని డాకిని ప్రెస్ మీట్ లో మాత్రం సహనాన్ని కోల్పోయినట్లే కనిపిస్తుందని పాత్రికేయులు ముచ్చటించుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.