నేచురల్ స్టార్ నాని తాజా ప్రయత్నం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలకు మ్యూజిక్ పరంగా ఇటీవల ఎంత కాన్ సన్ ట్రేట్ చేస్తున్నా అంతగా మెప్పు పొందలేకపోతున్నామన్న అసంతృప్తితో ఉన్నాడట నాని. ఎంపిక చేసుకునే లిరిక్.. సంగీత దర్శకుడిపైనా ఎక్కువగా దృష్టి సారిస్తున్నా రిజల్ట్ యావరేజ్ గానే ఉండడంతో అది కాస్తా అసంతృప్తిగానే మారుతోంది. ఈగ- నేను లోకల్- ఎంసీఏ- భలేభలే మగాడివోయ్ ఇలా ఏవో కొన్ని చిత్రాలు మ్యూజికల్ గా విజయవంతమయ్యాయి.
ప్రస్తుతం `వీ` సినిమాలో నానీ నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీ సినిమా ట్రైలర్ కి యావరేజ్ అన్న టాక్ రావడంతో కాస్త జాగ్రత్తపడుతున్నాడట. ఇక ఈ సినిమాతో పాటు మరో చిత్రం `శ్యామ్ సింగరాయ్` సెట్స్ కెళ్లనుంది. ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ డిజైన్ చేశారట. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేం రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని గత వారమే అధికారికంగా ప్రకటించారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను హైరేంజ్‌లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.
లోకేషన్స్.. కాస్టింగ్ సహా చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అలాగే మ్యూజిక్ పరంగానూ కాస్త హై రేంజుకే వెళుతున్నారట. ప్రసిద్ధ సంగీత దర్శకుడు.. ఆస్కార్ గ్రహీత రెహమాన్ తో ఒక పాట చేయించాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే లెజెండరీ సంగీత దర్శకుడు రెహమాన్ తో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోందట. అయితే నాని చిత్రానికి రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తారా ? అందులోనూ కేవలం ఒక్క పాటకు మాత్రమే స్వరాలు సమకూర్చేందుకు రెహమాన్ ఒప్పుకుంటారా ? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అసలు నానికి అంత సీన్ ఉందా ? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్న ఎదురవుతోంది.