ఆరు ఏళ్ల తర్వాత 'శాకుంతలం'తో పునః ప్రారంభం

Update: 2021-07-18 00:30 GMT
హైదరాబాద్ లో పర్యటక ప్రాంతంగా మంచి గుర్తింపు ఉన్న గండిపేట్‌ లో ఒకప్పుడు ప్రతి రోజు ఏదో ఒక సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉండేది. కాని ఆరు సంవత్సరాల క్రితం రక్షణ పరమైన కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ను అక్కడ నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. అప్పటి నుండి చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ అక్కడ షూటింగ్‌ కోసం ప్రయత్నాలు చేసినా కూడా విఫలం అయ్యారు. కాని గుణశేఖర్  మాత్రం అక్కడ షూటింగ్‌ చేసేందుకు అనుమతులు దక్కించుకున్నాడు. తన శాకుంతలం సినిమా షూటింగ్ ను అక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

గుణశేఖర్‌ అనూహ్యంగా గండిపేట్‌ లో షూటింగ్‌ చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆకర్షించాడు. ముందు ముందు మళ్లీ గండిపేట్‌ చెరువు మరియు పరిసర ప్రాంతాలు షూటింగ్‌ లతో బిజీ అవుతాయని కొందరు ఆశిస్తున్నారు. కాని గుణశేఖర్‌ సినిమా కోసమే ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చి ఉంటారని.. ఆ సినిమా కు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. శాకుంతలం తర్వాత ఇతర మేకర్స్ కూడా ఖచ్చితంగా షూటింగ్‌ కోసం అనుమతులు కావాలంటూ అడిగే అవకాశం ఉంది అప్పుడు అనుమతులు వస్తాయా లేదా అనేది క్లారిటీ వస్తుంది.

ఆరు సంవత్సరాల తర్వాత గండిపేట్ లో షూటింగ్‌ ను పునః ప్రారంభించబోతున్నందుకు ఖచ్చితంగా శాకుంతలం టీమ్‌ ను అభినందించాల్సిందే. దిల్‌ రాజు సమర్పణలో గుణ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమాలో టైటిల్‌ రోల్‌ ను సమంత పోషిస్తుండగా ఈ సినిమాలో కీలక పాత్రలో అల్లు అర్హ కనిపించబోతుండటం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్హ పాత్ర గురించి రకరకాలుగా పుకార్లు ఉన్నాయి. మీడియాలో ఆ విషయం చర్చ జరుగుతున్న సమయంలో గండిపేట్ లో షూటింగ్‌ అంటూ ఇప్పుడు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News