పెద్ద హీరో సినిమా వస్తోందంటే.. సామాన్య ప్రేక్షకుల కంటే ముందు ఏ అర్ధరాత్రో.. తెల్లవారుజామునో ఫ్యాన్స్ షో చూడాలని అభిమానులు తహతహలాడిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పట్నుంచో బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణలో కూడా ఈ స్పెషల్ షోలు ఉండేవి కానీ.. కొంత కాలంగా వాటికి పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇక తమిళనాడులో అయితే కేవలం స్టార్ హీరోల సినిమాలకే కాదు.. మీడియం రేంజ్ సినిమాలకు సైతం తెల్లవారుజామున షోలు పడుతుంటాయి. నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కోకో కోకిల’కు సైతం అక్కడ స్పెషల్ షోలు వేశారు. అలాంటిది విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే ఇక సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? ఇప్పటిదాకా తమిళ సినీ చరిత్రలోనూ మరే సినిమాకూ లేని విధంగా ‘సర్కార్’కు భారీగా బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు.
ఒక్క చెన్నైలోనే 100 థియేటర్లలో బెనిఫిట్ షోలకు ప్రణాళికలు రచించారు. ఇంత భారీగా సన్నాహాలు చేసుకుంటే ఇప్పుడు మద్రాస్ హైకోర్టు అందరి ఆశలపై నీళ్లు చల్లింది. ‘సర్కార్’కు ఎలాంటి ముందస్తు షోలు వేయడానికి వీల్లేదని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలతో విజయ్ అభిమానులు హతాశులయ్యారు. ఏళ్లుగా ఈ స్పెషల్ షోలకు అలవాటు పడ్డ ఫ్యాన్స్ కు ఈ నిర్ణయం మింగుడు పడటం లేదు. ఈ షోలు ఆపాలంటూ పిటిషన్ వేసిన వాళ్లపై మండిపడుతున్నారు. కొన్నేళ్లుగా విజయ్ సినిమా వస్తోందంటే ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడం.. వివాదాలు రేపడం అలవాటైపోయిందని.. ‘సర్కార్’ విషయంలో మరింత శృతి మించుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ‘సర్కార్’ కథ కాపీ వివాదంతో కోలీవుడ్ అట్టుడికింది. అది సద్దుమణిగిందనుకునే లోపే బెనిఫిట్ షోలకు బ్రేక్ పడటంతో విజయ్ అభిమానుల ఆగ్రహం మామూలుగా లేదు. ఐతే దీని మీద అప్పీల్ కు వెళ్లి ఎలాగైనా షోలు పడేలా చూడాలని ఫ్యాన్స్.. చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.