దాదాపు ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత థియేటర్లు తెరుచుకునేందుకు అవకాశం కల్పించగా.. టాలీవుడ్ లో తొలి రిలీజ్ గా నిలిచింది `సోలో బ్రతుకే సో బెటర్`. ఆ తర్వాత రవితేజ `క్రాక్` సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఇవి రెండూ ఆశాజనకమైన ఫలితాల్ని అందుకున్నాయి. ఆ సినిమా తర్వాత ఇప్పుడు భోగి కానుకగా దళపతి విజయ్ నటించిన అనువాద చిత్రం `మాస్టర్` తెలుగులో రిలీజైంది.
నేడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వందలాది థియేటర్లలో రిలీజవుతోంది. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం.. మెర్సల్ చిత్రంతో విజయం అందుకున్న విజయ్ పై తెలుగు నాటా టాక్ స్ప్రెడ్ అవ్వడం పాజిటివ్ అంశాలుగా మారాయి. మహమ్మారీ భయాల్ని విడిచి జనం థియేటర్లకు వస్తుండడం హోప్ ని పెంచుతోంది. క్రాక్ మంచి బాక్సాఫీస్ వసూళ్లతో ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే మాస్టర్ పాజిటివ్ సమీక్షల్ని అందుకుంటే చక్కని వసూళ్లు సాధిస్తుందనే అంచనా వేస్తున్నారు.
విజయ్ నటించిన చిత్రాలు డబ్బింగు అయ్యి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పోటీ పడుతున్న క్రమంలో మాస్టర్ రిజల్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రీడా నేపథ్యం.. మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన `మాస్టర్` లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం ప్లస్ కానుంది. లాక్ డౌన్ అనంతరం `మాస్టర్` భోగి కానుకగా సోలో రిలీజ్ అవకాశం దక్కించుకోవడం ప్లస్ కానుంది. ఈ సంక్రాంతికి రామ్ నటించిన రెడ్.. బెల్లంకొండ శ్రీను అల్లుడు అదుర్స్ చిత్రాలు పాజిటివ్ నోట్ తో రిలీజవుతున్నాయి. వీకెండ్ నాటికి నాలుగు సినిమాల ఫైనల్ రిపోర్ట్ పైనా క్రిటికల్ గానూ చర్చ సాగనుంది.