ఉగ్రవాదులు గన్ను తలకు పెట్టినా బెదరని నీరజా

Update: 2020-09-07 12:10 GMT
సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'నీరజా'. ఈ సినిమా ఒక వీర వనిత గురించి తెరకెక్కించారు. కేవలం 22 ఏళ్ల వయసులో జనాల కోసం తన ప్రాణాలు వదిలేసిన నీరజా బానోత్‌ బయోపిక్‌ గా తెరకెక్కిందే నీరజా మూవీ. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 1986 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో నీరజా అందరికి తెలిసింది. ప్లయిట్‌ అటెండెంట్‌ గా విధులు నిర్వహించే నీరజా ఉగ్రవాదులను గుర్తించి పైలెట్లను ముందస్తుగా హెచ్చరించి చాలా పెద్ద ప్రమాదంను జరుగకుండా నీరజా చేసింది. ఎంతో మంది ప్రాణాలు కాపాడి ఉగ్రవాదుల చేతిలో హతం అయ్యింది.

నేడు నీరజా బానోత్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె గురించి మరోసారి తలుచుకునే ఉద్దేశ్యంతో ఈ కథనం... అది 1986 సెప్టెంబర్‌ 5. ముంబయి నుండి న్యూయార్క్‌ వెళ్లేందుకు విమానం బయలు జేరింది. మద్యలో కరాచీలో విమానం ల్యాండ్‌ అయ్యి మళ్లీ అమెరికా వెళ్లాల్సి ఉంది. కరాచీలో ల్యాండ్‌ అయిన సమయంలో కొద్ది మంది దిగ్గారు మరికొందరు ఎక్కారు. ఆ సమయంలో నలుగురు అనుమానాస్పదంతో విమానం ఎక్కారు. వెంటనే వారిని గుర్తించి విమానం టేకాప్‌ కు కొన్ని సెకన్ల ముందు పైలెట్లకు విషయం తెలియజేసింది.

వినమానం టేకాఫ్‌ అయ్యి ఉంటే ఉగ్రవాదులు తాము కోరుకున్నట్లుగా సైప్రస్‌ కు వెళ్లి అక్కడ బందీలుగా ఉన్న తమ తోటి ఉగ్రవాదులను విడిపించుకోవాలనుకున్నారు. కాని విమానం టేకాఫ్‌ కాకపోవడంతో వారికి కోపం కట్టలు తెంచుకుంది. చాలా మందిని కట్టేయడంతో పాటు కొందరిని ఇష్టానుసారంగా కొట్టడం మొదలు పెట్టారు. నీరజాను కట్టి వేయకుండా అందరి వద్దకు వెళ్లి పాస్‌ పోర్ట్‌ లు తీసుకు రావాల్సింది సూచించారు. ఆ సమయంలో నీరజా ఎలాగైనా ప్రయాణికులను కాపాడాలని కోరుకుంది. అందుకే ఉగ్రవాదులను ఏదో ఒకటి చేసి విసిగించి వారి దృష్టిని మల్లిస్తూ కొందరిని ఎమర్జెన్సీ డోర్‌ నుండి బయటకు పంపించింది.

మరి కొందరు పాస్‌ పోర్ట్‌ లు దాచి పెట్టింది. కాక్‌ పిట్‌ లో ఉన్న సిబ్బందిని కూడా గాయ పర్చేలా ఉగ్రవాదులు చేశారు. నీరజా ఏదో ప్లాన్‌ చేస్తుందన్న అనుమానం వచ్చిన ఉగ్రవాదులు ఆమెను కాల్చి చంపేశారు. అప్పటికే ఆమె చాలా మందిని సేవ్‌ చేసింది. ఆమె సేవ్‌ చేసిన చాలా మంది ఇప్పటికి ఉన్నారు. వారు ఆమె సాహసం గురించి కథలు కథలుగా చెబుతూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆమె ధైర్య సాహసాలకు గాను చనిపోయిన తర్వాత అశోక చక్రను అందుకుంది.
Tags:    

Similar News