బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈమద్య కాలంలో చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కాని ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రేస్ 3’ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సల్మాన్ గత చిత్రాలతో పోల్చితే రేస్ 3 చిత్రం అతి తక్కువ వసూళ్లను నమోదు చేయడం జరిగింది. ఈమద్య కాలంలో సల్మాన్ ఖాన్ తీవ్రంగా నిరాశ పర్చిన చిత్రం ఇదే అంటూ బాలీవుడ్ మీడియా కూడా కథనాలను రాయడం జరిగింది. ఇక ఈ చిత్రం ఫ్లాప్ కు ప్రధాన కారణంగా సల్మాన్ అంటూ దర్శకుడు రెమో డిసౌజా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ప్రముఖ మీడియా సంస్థ పిటీఐతో దర్శకుడు రెమో డిసౌజా మాట్లాడుతూ.. ‘రేస్ 3’ చిత్రం కథ పూర్తి అయిన తర్వాత నిర్మాతలు అనేక మార్పులు చేశారు. సల్మాన్ పాత్ర నెగటివ్ గా చూపించేందుకు వారు ఒప్పుకోలేదు. దాంతో సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగి స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయించాడు. కథ, స్క్రీన్‌ఫ్లే, దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఇవ్వాల్వ్‌మెంట్ ఉన్న కారణంగానే ఈ చిత్రం ఆడలేదు అంటూ రెమో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రేస్ 3’లో సల్మాన్ ఖాన్ పాత్రను పూర్తిగా మార్చేశారు. నేను మొదటి నుండి అనుకున్నట్లుగా సినిమా తెరకెక్కితే మంచి ఫలితం ఉండేది అంటూ రెమో అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సినిమా విడుదల సమయంలో పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదు. ఈ చిత్రంలో అద్బుతమైన యాక్షన్ సీన్స్, ఎంటర్ టైన్ చేసే డైలాగ్స్, మంచి పాటలు ఉన్నా కూడా వాటిని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో విఫలం అయ్యాం. పబ్లిసిటీ సరిగా చేయక పోవడం వల్లే ఈ చిత్రంకు మంచి ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇంత కంటే చెత్త టాక్‌ను దక్కించుకున్న చిత్రాలు కూడా మంచి వసూళ్లను గతంలో రాబట్టాయి. కనుక ఈ చిత్రం పబ్లిసిటీ సరిగా లేని కారణంగానే వసూళ్లు రాలేదు అంటూ రెమో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
‘రేస్ 4’ చిత్రానికి రెమో దర్శకత్వం వహించే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాజా వ్యాఖ్యల కారణంగా రెమోకు రేస్ 4 ఛాన్స్ మిస్ అయినట్లే అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. మరో వైపు ప్రస్తుతం రెమో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో సల్మాన్ గెస్ట్ పాత్రను చేయబోతున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. సల్మాన్ ఇప్పుడు గెస్ట్ పాత్రలో కనిపించడం దాదాపు అనుమానమే అంటూ బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు.